
నాగచైతన్య హీరోగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందిన చిత్రం ‘కస్టడీ’. కృతి శెట్టి హీరోయిన్. శ్రీనివాస చిట్టూరి నిర్మించారు. ఈనెల 12న సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రెస్ మీట్ నిర్వహించారు. నాగచైతన్య మాట్లాడుతూ ‘నిజం అనే ఆయుధంతో ఒక మామూలు కానిస్టేబుల్ ఎంత దూరం వెళ్లాడనేది కథ. వెంకట్ ప్రభు స్క్రీన్ ప్లే టెక్నిక్ అద్భుతంగా ఉంటుంది. ఈ సినిమాతో తమిళంలో లాంచ్ అవడం హ్యాపీ. ఇందులో చాలా లేయర్స్ ఉన్నాయి.
ప్రతి పది నిముషాలకు ఒకటి రివీల్ అవుతుంది. కథ వినగానే ఎంత నచ్చిందో, సినిమా చూశాక అదే ఫీలింగ్ కలిగింది. ప్రేక్షకుల రియాక్షన్ చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అన్నాడు. ‘స్టోరీ లైన్ సింపుల్‌గా ఉన్నా స్క్రీన్ ప్లే ఇంటెలిజెంట్‌గా ఉంటుంది. ప్రేక్షకులు చాలా ఎక్సయిట్ అవుతారు. నాగచైతన్యతో రెండో సినిమా చేయడం హ్యాపీ’ అంది కృతి. వెంకట్ ప్రభు మాట్లాడుతూ ‘నా కెరీర్‌లో ఇది భారీ చిత్రం. కంప్లీట్ యాక్షన్ మూవీ. ప్రతి కథలో హీరో విలన్‌ని చంపాలనుకుంటాడు. కానీ ఇందులో కాపాడతాడు. ఫ్రెష్‌గా ఉంటుంది. కథకు నాగచైతన్య పర్ఫెక్ట్ యాప్ట్. తెలుగు, తమిళ్ వెర్షన్స్‌ని ఒకే సమయంలో షూట్ చేశాం’ అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో నిర్మాత శ్రీనివాస చిట్టూరి, సమర్పకులు పవన్ పాల్గొన్నారు.