నేటితో ముగియనున్న డ్రగ్స్ కేసు నిందితుల కస్టడీ

నేటితో ముగియనున్న డ్రగ్స్ కేసు నిందితుల కస్టడీ

ఫుడింగ్ అండ్ మింక్ పబ్ డ్రగ్స్ కేసు నిందితుల పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. నార్కోటిక్స్ అధికారులు, బంజారాహిల్స్ పోలీసులు మూడు రోజుల నుంచి ప్రశ్నిస్తున్నా.. నిందితులు అభిషేక్, అనిల్ మాత్రం నోరు మెదపలేదని సమాచారం. డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు. ఎవరెవరికి సరఫరా చేశారు. ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారన్న ప్రశ్నలకు నిందితులు ఏమీ తెలియదని చెప్పినట్లు సమాచారం. పార్టీకి వచ్చిన కస్టమర్లే డ్రగ్స్ తెచ్చుకున్నారని చెప్పినట్లు తెలుస్తోంది. 

విచారణలో భాగంగా నిందితులు అభిషేక్, అనిల్ మొబైల్ ఫోన్లలోని డేటా ఆధారంగా పోలీసులు కూపీ లాగుతున్నారు. అందులో ఉన్న పలువురు డ్రగ్ పెడ్లర్ల గురించి ఆరా తీస్తున్నారు. గోవా, ముంబై, నైజీరియా నుంచి కొకైన్ తెచ్చి పబ్ లో అమ్ముతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ దిశగా విచారణ జరిపినప్పటికీ నిందితులు మాత్రం నోరు విప్పలేదు. చివరి రోజు విచారణలోనైనా ఏమైనా సమచారం లభించవచ్చని అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తల కోసం..

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

ఇంత జరుగుతున్నా మోడీ ఎందుకు మౌనంగా ఉన్నారు?