దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

దేశంలో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు సంఖ్య మళ్లీ పెరుగుతోంది. శనివారం 975 కరోనా కేసులు నమోదుకాగా.. ఆదివారం కొత్తగా1,150 మందికి కొవిడ్ 19 సోకింది. నిన్నటితో పోలిస్తే కేసుల సంఖ్య 17 శాతం ఎక్కువ. కొత్తగా నమోదైన వాటితో కలుపుకుని దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,30,42,097కు చేరింది. వీరిలో 4,25,08,788 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. గత 24 గంటల్లో వైరస్ కారణంగా నలుగురు చనిపోగా.. 954 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ప్రస్తుతం దేశంలో 11,558 యాక్టివ్ కేసులున్నాయి. 

దేశంలో మొత్తం కేసుల్లో 0.03 శాతం మాత్రమే యాక్టివ్‌ కేసులు ఉండగా.. రికవరీ రేటు 98.76 శాతంగా ఉంది. ఇప్పటివరకు 1,86,51,53,593 వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, శనివారం 12,56,533 మంది టీకా తీసుకున్నారు. 

For more news..

ఈ ఊళ్లో ఉప్పు గని ఉంది

మూడేళ్ల తర్వాత ఐపీఎల్‌ ముగింపు వేడుక