
న్యూఢిల్లీ: మూడేళ్ల గ్యాప్ తర్వాత ఈ సీజన్ ఐపీఎల్‌లో ముగింపు వేడుక నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది. కరోనా కారణంగా మూడుసార్లు ఈ ఈవెంట్లను రద్దు చేసిన బోర్డు మే 29న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఫైనల్‌కు ముందు ముగింపు వేడుకను ప్లాన్ చేసింది. దీన్ని నిర్వహించేందుకు ఈవెంట్ మేనేజ్‌మెంట్ కంపెనీలు ఈనెల 25వ తేదీలోపు ప్రతిపాదనలు ఇవ్వాలని కోరింది. కరోనా నేపథ్యంలో ఈ సీజన్ లీగ్ మ్యాచ్‌లను ముంబై, పుణెలోని నాలుగు స్టేడియాల్లో నిర్వహిస్తోంది. ప్లే ఆఫ్స్ వేదికలను బోర్డు ఇంకా ఖరారు చేయలేదు.