కటింగ్ కోసం వచ్చి.. స్క్రూడ్రైవర్ తో దాడి

కటింగ్ కోసం వచ్చి.. స్క్రూడ్రైవర్ తో దాడి

ఓ 5 నిమిషాలు వెయిట్ చేస్తే కటింగ్ చేస్తానన్న బార్బర్ సమాధానంతో ఆగ్రహించిన ఓ వ్యక్తి అతనిపై స్క్రూ డ్రైవర్ తో దాడి చేసి పరారయ్యాడు. నేరేడ్ మేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బద్రి సెలూన్ షాప్ లో ఈ ఘోరం జరిగింది. షాప్ లో పనిచేసే మంజైర కస్టమర్ కు కటింగ్ చేస్తున్న సమయంలో ప్రకాశ్ అనే యవకుడు సెలూన్​ లోకి ప్రవేశించి తనకు త్వరగా కటింగ్ చేయలంటూ రుబాబు చేశాడు.

అప్పటికే ఓ వ్యక్తికి కటింగ్ స్టార్ట్ చేసాడు కాబట్టి… ఓ 5 నిమిషాలు ఆగాలని కోరాడు. అతడి సమాధానం నచ్చని ఆ యువకుడు అగ్రహంతో.. ప్రక్కనే ఉన్న బైక్ మెకానిక్​ షాప్ లో నుంచి స్క్రూడ్రైవర్ తీసుకువచ్చి మంజైర పై విచక్షణా రహితంగా దాడి చేశాడు. అదే సమయంలో కటింగ్ షాప్ యాజమని బద్రి అడ్డు కోవడంతో అతనిపై కూడ రాయితో దాడి చేసిన పారిపోయాడు ఆ యువకుడు. బాధితులు నాయిని బ్రహ్మణులతో కలసి నేరేడ్ మేట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు​ చేశారు.