న్యూఢిల్లీ: డాలర్‌తో రూపాయి విలువ 90కి చేరినప్పటికీ, కరెన్సీ విలువ దానికదే సర్దుకుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. రూపాయి స్థాయిని అదే నిర్ణయించుకోవాలని కామెంట్ చేశారు. ఈ విషయంలో ప్రత్యేకంగా టార్గెట్లను పెట్టుకోలేదని చెప్పారు. ఢిల్లీలో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ .. రూపాయి విలువ తగ్గడం వల్ల ఎగుమతిదారులకు లాభం ఉంటుందన్నారు.
ఆర్థిక వృద్ధి పై స్పందిస్తూ.. ఇక నుంచి కూడా జోరు కొనసాగుతుందని, ఈ ఆర్థిక సంవత్సరంలో మనదేశ వృద్ధిరేటు ఏడు శాతం మించుతుందని తెలిపారు. సెప్టెంబరు క్వార్టర్లో మాదిరే ఇక నుంచి కూడా వృద్ధి కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆర్బీఐ వృద్ధి అంచనాను 7.3 శాతానికి పెంచిన నేపథ్యంలో ఆమె ఈ కామెంట్స్ చేశారు.
