కో-బ్రాండెడ్​ కార్డులను తెగ కొంటున్నరు

కో-బ్రాండెడ్​ కార్డులను తెగ కొంటున్నరు

ఫ్యూయల్​కార్డులకు మస్తు గిరాకీ          
తరువాత ఈ–కామర్స్​ కార్డులు

న్యూఢిల్లీ: చిన్న, మధ్యస్థాయి పట్టణాల్లో,  నగరాల్లో   క్రెడిట్ కార్డ్‌‌‌‌లను  ఉపయోగించడం పెరుగుతోంది. వీటిని తీసుకునే షాపుల సంఖ్య పెరగడం, వినియోగం సులభతరం కావడం, ఈజీగా రావడం ఇందుకు కారణాలు. సాధారణ క్రెడిట్​కార్డుల కంటే కో–బ్రాండెడ్​కార్డుకు గిరాకీ బాగా ఉంది.  పెట్రోల్​/డీజిల్​ పోయించుకుంటే రివార్డు పాయింట్లు వచ్చే ఫ్యూయల్​ క్యాష్‌‌‌‌బ్యాక్ క్రెడిట్ కార్డ్‌‌‌‌లకు అధిక డిమాండ్‌‌‌‌ కనిపిస్తోంది. ట్రావెల్,  ఈ–-కామర్స్ క్రెడిట్ కార్డ్‌‌‌‌లను కూడా చాలా మంది తీసుకుంటున్నారని ఫిన్​టెక్​ ప్లాట్​ఫారమ్​ జెడ్​ఈటీ విడుదల చేసిన స్టడీ రిపోర్టు వెల్లడించింది.  

పెట్రో ఖర్చులు పెరగడంతో, ఫ్యూయల్​ క్రెడిట్ కార్డ్‌‌‌‌లు అన్ని ప్రాంతాల్లో ప్రజాదరణ పొందుతున్నాయి. 2023లో ఇవి 17శాతం వార్షిక వృద్ధిని నమోదు చేశాయి. ఈ కార్డ్‌‌‌‌లు క్యాష్‌‌‌‌బ్యాక్, రివార్డ్ పాయింట్లను లేదా పెట్రోల్​ కొనుగోళ్లపై తగ్గింపులను అందిస్తాయి.   బీపీసీఎల్ ఎస్​బీఐ  క్రెడిట్ కార్డ్, ఇండియన్ ఆయిల్ కోటక్ క్రెడిట్ కార్డ్, ఐడీఎఫ్​సీ హెచ్​పీసీఎల్​క్రెడిట్ కార్డ్ వంటి ఫ్యూయల్​ క్యాష్‌‌‌‌బ్యాక్ కార్డ్‌‌‌‌లకు చాలా డిమాండ్​ ఉంది. టైర్-2,  3 పట్టణాలు, నగరాలవాసులు కూడా హాలిడేలకు వెళ్లడం పెరిగింది. 

అందుకే   ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌‌‌‌లు కూడా ఆదరణ పొందుతున్నాయి. ట్రావెల్ క్రెడిట్ కార్డ్‌‌‌‌ల డిమాండ్ 2023లో వేగంగా పెరిగింది. ఇవి ఎయిర్ మైల్స్, హోటల్ డిస్కౌంట్‌‌‌‌లు, ట్రావెల్​ రివార్డ్‌‌‌‌ల వంటివి ఇస్తాయి. ఎస్​బీఐ ఐఆర్​సీటీసీ, యాక్సిస్​ విస్తారా, ఐడీఎఫ్​సీ విస్తారా కార్డులకు ఫుల్లు డిమాండ్ ఉంది.