APK ఫైల్స్ ఇన్ స్టాల్ చేసుకోకండి సామీ.. హైదరాబాద్లో ఏమైందో చూడండి..!

APK ఫైల్స్ ఇన్ స్టాల్ చేసుకోకండి సామీ.. హైదరాబాద్లో ఏమైందో చూడండి..!

బషీర్​బాగ్, వెలుగు: సైబర్ చీటర్స్ ఏపీకే ఫైల్స్ ను పంపి, ఐదుగురిని మోసం చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. 62 ఏళ్ల వ్యక్తితో ఏపీకే ఫైల్ ఇన్​స్టాల్ చేయించి కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డు నుంచి రూ.1,72,9999 కాజేశారు. 44 ఏళ్ల మరో బాధితుడు ఏపీకే లింక్ క్లిక్ చేసి రూ.2,24,875 పోగొట్టుకున్నాడు. 38 ఏళ్ల వ్యక్తికి బీమా డీయాక్టివేషన్ పేరుతో లింక్ పంపించి, రూ.1,09,891 కాజేశారు.

45 ఏళ్ల వ్యక్తి మొబైల్లో అతనికి తెలియకుండానే ఏపీకే ఇన్​స్టాల్ కావడంతో రూ. 1,24,000 పోగొట్టుకున్నాడు. ఓ వృద్ధుడు యూనియన్ బ్యాంక్ లైఫ్ సర్టిఫికెట్ వెరిఫికేషన్ పేరిట స్కామర్స్ పంపిన ఏపీకే ఫైల్ ను ఇన్​స్టాల్ చేయడంతో ఆయన రిటైర్మెంట్ బెనిఫిట్స్ డబ్బులు మొత్తం రూ.10 లక్షలు పోగొట్టుకున్నాడు. బాధితులు మంగళవారం వేర్వేరుగా సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ పేర్కొన్నారు.