బషీర్‌బాగ్, వెలుగు: డీమార్ట్ పేరిట నకిలీ ఆఫర్పెట్టి ఓ వృద్ధుడిని సైబర్ చీటర్స్ మోసగించారు. హబ్సిగూడ ప్రాంతానికి చెందిన 75 ఏండ్ల వృద్ధుడు ఫేస్ బుక్ స్క్రోల్ చేస్తుండగా, డీమార్ట్ పేరుతో ఓ ఆఫర్ కన్పించింది. అది నిజమేనని నమ్మిన బాధితుడు కిరాణా సామగ్రి కోసం లింక్ క్లిక్ చేసి, మొబైల్ నంబర్ ను నమోదు చేశారు. కాసేపటికి సదరు నంబర్‌కు స్కామర్లు కాల్ చేసి, ఆఫర్‌కోసం బాధితుడి వాట్సాప్ కు ఓ ఏపీకే ఫైల్ ను పంపించారు. ఆ ఫైల్ ను ఇంస్టాల్ చేసిన వెంటనే బాధితుడి ఫోన్ హ్యాకింగ్ కు గురైంది. ఆ తర్వాత బ్యాంక్అకౌంట్లో నుంచి మొత్తం రూ.1.09 లక్షలు మూడు దఫాలుగా డెబిట్ అయ్యింది. దీంతో మోసపోయామని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
