రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు : కమిషనర్ ఫోన్ ​నెంబర్​పై ఫేక్​ ఐడీ క్రియేట్​

రెచ్చిపోతున్న సైబర్ నేరగాళ్లు : కమిషనర్ ఫోన్ ​నెంబర్​పై ఫేక్​ ఐడీ క్రియేట్​

సిద్దిపేట రూరల్, వెలుగు :  జిల్లాలో సైబర్ నేరగాళ్లు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. సామాన్యులు, అధికారులు, ప్రజాప్రతినిధులు ఇలా ఎవరినీ వదిలిపెట్టడం లేదు. గతంలో కలెక్టర్ కు సైబర్ క్రిమినల్స్ షాకివ్వగా, తాజాగా సిద్దిపేట సీపీకి తలనొప్పిగా మారారు. పోలీస్ కమిషనర్ శ్వేత సెల్ నెంబర్ 9934941611 పైన సైబర్ నేరగాళ్లు ఫేక్ ఐడీ క్రియేట్ చేశారు. ఈ ఐడీ ద్వారా డబ్బులు అత్యవసరంగా ఉన్నాయని రూ.30వేలు పంపించమని, తిరిగి గంటలోపు పంపిస్తానని మెసేజ్ లు పంపుతున్నారు.

ఈ మెసేజ్ లు చూసి పోలీస్ కమిషనర్ డబ్బులు పంపించమని అడగడం ఏంటని  ప్రజలు, పోలీస్ అధికారులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ విషయం తెలిసి కమిషనర్ శ్వేత షాక్ కు గురయ్యారు. వెంటనే తన పేరుతో ఎవరు మెసేజ్ లు పంపినా స్పందించ వద్దని విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ఫ్రాడ్ మెసేజ్ ల విషయంలో ప్రజలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.