
హైదరాబాద్: పెళ్ళి పేరుతో ఇద్దరు మహిళలను మోసం చేశారు సైబర్ నేరగాళ్లు. ముస్లిమ్ సంఘం మ్యాట్రిమోని అనే వెబ్ సైట్ ద్వారా హైదరాబాద్ లోని బషీర్ బాగ్, మాదన్న పేట్ ప్రాంతాలకు చెందిన ఇద్దరి మహిళల వివరాలు సేకరించారు ఆ కేటుగాళ్లు. తాము విదేశాల్లో డాక్టర్లుగా పనిచేస్తున్నామని చెప్పి .. ఆ వెబ్‌సైట్‌లో వారితో పర్సనల్ చాట్ చేస్తూ.. పెళ్లి చేసుకుందామని నమ్మించారు. పెళ్లి కోసం బహుమతులు, డబ్బులు పంపిస్తున్నామని మాయమాటలు చెప్పారు.
ఆ తర్వాత హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుండి ఫోన్ చేస్తున్నామని మరో టీమ్ చేత చెప్పించి.. విలువైన బహుమతులు, డబ్బులు వచ్చాయని.. వాటికి కస్టమ్స్, ఐటి ఇతర చార్జీల పేరుతో ఇద్దరి మహిళల నుండి రూ. 1.70 లక్షలు వసూలు చేశారు. హుమతులు, డబ్బులు రాకపోవడంతో తాము మోసపోయామని గ్రహించి బాధిత మహిళలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు పిర్యాదుప చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. ఆ కేటుగాళ్లను వెతికే పనిలో పడ్డారు.