అమెజాన్ కస్టమర్ కేర్ పేరుతో .. రూ.1.36 లక్షలు మోసం

అమెజాన్ కస్టమర్ కేర్ పేరుతో .. రూ.1.36 లక్షలు మోసం

బషీర్​బాగ్, వెలుగు: అమెజాన్ కస్టమర్ సపోర్ట్ నుంచి కాల్ చేస్తున్నామని నమ్మించి ఓ వృద్ధుడిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్ సైబర్ క్రైం ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. గాంధీనగర్ కు చెందిన ఓ వృద్ధుడు ఈ నెల 14న అమెజాన్ లో ఒక వస్తువును ఆర్డర్ చేశాడు. అడ్రస్​లో సమస్య కారణంగా క్యాన్సిల్​అయిందని చీటర్స్​18న కాల్ చేశారు. 

ఇది నమ్మిన బాధితుడు మరోసారి ఆర్డర్ పెట్టాడు. అయినా రాకపోవడంతో గూగుల్ లో అమెజాన్ కస్టమర్ కేర్ నంబర్ కోసం సెర్చ్ చేశాడు. స్కామర్స్ పోస్ట్ చేసిన ఫేక్ కస్టమర్ నంబర్ ను సంప్రదించాడు. వారు వాట్సాప్​కాల్​చేసి, రూ.10  వెరైఫికేషన్ కోసం డిపాజిట్ చేయాలని లేకపోతే ఆర్డర్ క్యాన్సిల్ అవుతుందని చెప్పారు. అనంతరం ఓటీపీ చెప్పాలని అడగడంతో చెప్పాడు. స్కామర్స్​అతని అకౌంట్ నుంచి రూ.1,36,890 కాజేశారు. గురువారం బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏసీపీ పేర్కొన్నారు.