గోదావరిఖనిలో సైబర్ మోసం

గోదావరిఖనిలో సైబర్ మోసం

గోదావరిఖని, వెలుగు: గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో సైబర్​ మోసగాళ్లు రెచ్చిపోయారు. వాట్సప్​లో వచ్చిన లింక్​ను ఓపెన్​ చేసిన పలువురి అకౌంట్ల నుంచి డబ్బులు మాయమయ్యాయి. గోదావరిఖనిలో ఓ సింగరేణి కార్మికుడి అకౌంట్​ నుంచి రూ.30వేలు, రూ.20 వేలు, రూ.7,500, రూ,7,505 చొప్పున డబ్బులు మాయం కావడంతో బాధితుడు 1930 నంబర్​కు ఫోన్​ చేసి ఫిర్యాదు చేశాడు. 

యైటింక్లైన్​ కాలనీలో పలువురికి వాట్సప్​లో వచ్చిన లింక్​ ఓపెన్​ చేయడంతో డబ్బులు మాయమయ్యాయి. పోలీసులు రంగంలోకి దిగి వివరాలు సేకరిస్తున్నారు. వాట్సప్​లో వచ్చే లింక్​ను ఓపెన్​ చేయకుండా జాగ్రత్త పడాలని గోదావరిఖని ఏసీపీ ఎం.రమేశ్​​సూచించారు.