హైదరాబాద్ లో మరో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. ఫిషింగ్, సిమ్ స్వాప్ ద్వారా సైబర్ మోసాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. సిటీబ్యాంక్ ప్రేస్టిజ్ అధికారులుగా నటించి బాధితుల దగ్గరి నుంచి రూ.77 లక్షల 45వేల 451 మోసం చేశారు నేరగాళ్లు. కొరియర్ ద్వారా ప్రీ లోడెడ్ ఫోన్లు పంపించి..ఓటీపీ వెరిఫికేషన్ పేరుతో బాధితులను మోసం చేశారు. బాధితుల మొబైల్ ల మాలీషియస్ యాప్స్ ఇంస్టాల్ చేసి..ఓటీపీలు సేకరించి బ్యాంకు అకౌంట్లలోకి ఎంటరై మోసానికి పాల్పడ్డారు.
బాధితుల ఖాతాల నుంచి ఆన్‌లైన్‌లో డబ్బుల మాయం అవ్వడంతో పోలీసులను ఆశ్రయించారు బాధితులు. బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు పశ్చిమ బెంగాల్ లోని నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు. ట్రాన్సిట్ వారెంట్లపై నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ముఠాలోని ప్రధాన నిందితుడు సెలీమ్ మండల్ ను అరెస్ట్ చేశారు.
పశ్చిమ బెంగాల్ లోయిన్ నదియా జిల్లాకు చెందిన సెలీమ్ అను అదుపులోకి తీసుకొని 6 మొబైల్ ఫోన్లు, 5 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సిటిబ్యాంక్ లేబుల్స్, మోటరోలా స్టికర్లు, ఆక్స్ కేబుల్ సీజ్ చేశారు. ముఠాలోని మిగతా నిందితులు ముర్షీదాబాద్ కు చెందిన సయ్యద్ హసీం రెజా, రాజస్థాన్, దుందార్షహర్ దగ్గర మరో నిందితుడు, ముర్షిదాబాద్ జిల్లాకు చెందిన మరో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు పోలీసులు.
