గచ్చిబౌలి, వెలుగు: అఖిల భారత పోలీస్ సెపక్ తక్రా చాంపియన్‌షిప్ పోటీల్లో సైబరాబాద్ సీఎస్‌డబ్ల్యూ విభాగానికి చెందిన కానిస్టేబుల్ ఎన్.మనోజ్‌కుమార్ వరుసగా మూడు సంవత్సరాలు ప్రతిభ చాటుతూ మొత్తం ఐదు కాంస్య పతకాలు సాధించాడు. దక్షిణ ఆసియాకు చెందిన వేగవంతమైన ఈ క్రీడలో కాళ్లు, మోకాళ్లు, ఛాతి, భుజాలు ఉపయోగించి గాలిలోనే బంతిని నెట్ పైకి వేయాలి.
హర్యానా మధుబన్‌లో 2025లో జరిగిన 73వ ఆల్ ఇండియా పోలీస్ సెపక్ తక్రా చాంపియన్‌షిప్‌లో మనోజ్ నిలకడమైన ప్రదర్శనతో పతకం సాధించాడు. జలంధర్‌లో 2022లో జరిగిన 71వ, నాగ్‌పూర్‌లో 2024లో నిర్వహించిన 72వ చాంపియన్‌షిప్‌లోనూ ఆయన పతకాలు సాధించాడు.

