45 రోజుల్లో 1,061 ఫోన్ల రికవరీ

45 రోజుల్లో 1,061 ఫోన్ల రికవరీ

గచ్చిబౌలి, వెలుగు: సైబరాబాద్ పోలీసులు 45 రోజుల్లో రూ.3.20 కోట్ల విలువైన 1,061 సెల్​ఫోన్‌‌‌‌‌‌‌‌లను రికవరీ చేశారు. వీటిని గచ్చిబౌలిలోని కమిషనరేట్ కార్యాలయంలో బాధితులకు గురువారం అందజేశారు. సెల్‌‌‌‌‌‌‌‌ఫోన్ పోగొట్టుకున్నా లేదా దొంగలించబడినా వెంటనే సమీప పోలీస్ స్టేషన్​లో లేదా సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయాలని సైబరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ సూచించారు. 2023 నుంచి సీసీఎస్ సైబరాబాద్, ఐటీ సెల్ సహాయంతో 13,423 ఫోన్​లు స్వాధీనం చేసుకున్నామన్నారు. క్రైమ్ ఏడీసీపీ రామ్​కుమార్, ఏసీపీ నాగేశ్వర్‌‌‌‌‌‌‌‌రావు, ఇన్​స్పెక్టర్‌‌‌‌‌‌‌‌లు, ఎస్సైలు, బాధితులు పాల్గొన్నారు.