
- ఏఐ టూల్స్, నకిలీ వెబ్‌సైట్స్, స్టాక్ మార్కెట్ ఫేక్ ప్రిడిక్షన్స్ పేరుతో 3,164 మందికి టోకరా
- ఇద్దరిని అరెస్ట్ చేసిన సైబరాబాద్ పోలీసులు
హైదరాబాద్ సిటీ, వెలుగు : ఏఐ టూల్స్వాడి.. నకిలీ వెబ్‌సైట్స్, స్టాక్ మార్కెట్ ఫేక్ప్రిడిక్షన్స్ పేరుతో 3,164 మందిని మోసం చేసి రూ.850 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్చేసిన ఇద్దరిని సైబరాబాద్పోలీసులు అరెస్ట్‌చేశారు. ఈ స్కామ్‌లో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన సుమారు 3వేల మంది బాధితులు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. సైబరాబాద్ఎకనామిక్అఫెన్స్వింగ్పోలీసుల కథనం ప్రకారం.. ఏపీకి చెందిన గడ్డం వేణుగోపాల్ మణికొండలో ఉంటున్నాడు. శ్రీనివాస్ అనలిటికల్ ప్రైవేట్ లిమిటెడ్, ఏవీ సొల్యూషన్స్‌కు డైరెక్టర్ గా ఉన్నాడు. ఇతను ఏవీ సొల్యూషన్ఉద్యోగి శ్రేయస్ పాల్ తో కలిసి మోసాలకు తెరతీశాడు. ఏఐ ప్లాట్‌ఫారమ్‌లు, ఫోంజీ స్కీమ్, ఫేక్స్టాక్మార్కెట్ప్రిడిక్షన్స్ పేరుతో బాధితుల నుంచి పెట్టుబడులు పెట్టించేవారు. పెట్టబుడిదారులకు 7 శాతం నెలనెలా ఆదాయం ఉంటుందని నమ్మించేవారు.
వీరు ఐఐటీ క్యాపిటల్టెక్నాలజీస్ మాదాపూర్, ఏవీ సొల్యూషన్స్ కొండాపూర్, శ్రీనివాస్అనాలటిక్స్ ప్రైవేట్లిమిటెడ్, ట్రేడ్బుల్స్టెక్నాలజీ కంపెనీలను నడుపుతున్నట్టు బాధితులను నమ్మించేవారు. అలాగే, వీరు ఎనిమిది రకాల ఫేక్వైబ్సైట్లను సృష్టించి, మధ్యతరగతి వారిని, వర్కింగ్ఫ్రొఫెషనల్స్, రిటైర్డ్అయిన వారిని టార్గెట్ చేసేవారు. ఐఐటీ స్టాక్‌మార్కెట్, మై షేర్ప్రాఫిట్, ఏవీగ్రూప్స్, ఫెహుఫిన్, ట్రేడ్ఆన్నంబర్స్, స్మాల్గో, శ్రీమాతా, మహేశ్వరఅడ్వైజరీ సర్వీసెస్ల పేరుతో వెబ్సైట్లను సృష్టించారు. ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే నెలకు 7 శాతం, ఏడాదికి 84శాతం ఆదాయం వస్తుందని నమ్మించారు. వీరి ఫ్రాడ్‌పై సైబరాబాద్ఎకానమిక్స్అఫెన్స్ వింగ్‌కు వచ్చిన ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేసి మంగళవారం వేణుగోపాల్‌ను, శ్రేయస్పాల్ను అరెస్ట్ చేశారు. వీరి నుంచి టయోటా ఫార్చునర్, 11 ల్యాప్‌టాప్‌లు, 14 చెక్‌బుక్‌లు, 30 ప్రామిసరీ నోట్స్స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.