ఐటీ ఉద్యోగుల లాగ్ అవుట్.. మూడు షిఫ్టుల్లో

ఐటీ ఉద్యోగుల లాగ్ అవుట్.. మూడు షిఫ్టుల్లో

హైదరాబాద్​లో వర్షాల కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐటీ కంపెనీల ఉద్యోగులందరూ ఒకేసారి కాకుండా.. మూడు షిఫ్టుల్లో లాగ్ అవుట్ చేయాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఈ మేరకు మాదాపూర్ డీసీపీ సందీప్​ కుమార్​మంగళవారం అడ్వైజరీ నోట్ విడుదల చేశారు.

గచ్చిబౌలి, వెలుగు:  హైదరాబాద్ లో భారీ వర్షాల కారణంగా పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుండడంతో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐటీ కంపెనీల ఉద్యోగులందరూ ఒకేసారి కాకుండా.. మూడు షిఫ్టుల్లో లాగ్ అవుట్ చేయాలని సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఈ మేరకు మాదాపూర్ డీసీపీ సందీప్​కుమార్​మంగళవారం అడ్వైజరీ నోట్ విడుదల చేశారు. అందులో ఏయే టైమింగ్స్ లో, ఏ రూట్​లోని కంపెనీల ఉద్యోగులు లాగ్ అవుట్ చేయాలో పేర్కొన్నారు. ఇవి బుధవారం వరకు అమల్లో ఉండనున్నాయి. తమ సూచనను అన్ని కంపెనీలు పాటించాలని డీసీపీ కోరారు. 

ఎవరెప్పుడు లాగ్ అవుట్ చేయాలంటే.. 

ఫేజ్​1: మధ్యాహ్నం 3 గంటలు
 

ఐకియా నుంచి సైబర్ టవర్స్ రూట్​లో ఉన్న ఐటీ కంపెనీల ఉద్యోగులు మధ్యాహ్నం 3 గంటలకు లాగ్ అవుట్ చేయాలి. ఈ రూట్​లో టీసీఎస్​, హెచ్ఎస్​బీసీ, డెల్, ఒరాకిల్, క్వాల్​కమ్​, టెక్​మహీంద్ర, రహేజా మైండ్​స్పేస్, ఫినిక్స్​లోని ఐటీ కంపెనీలు ఉన్నాయి. 

ALSO READ :స్కూళ్లు, కాలేజీలకు.. ఇయ్యాల, రేపు సెలవు‌‌‌‌‌‌‌‌

ఫేజ్​2: సాయంత్రం 4:30 గంటలు 


ఐకియా, బయోడైవర్సిటీ, రాయదుర్గంలో ఉన్న ఐటీ కంపెనీల ఉద్యోగులు సాయంత్రం 4:30 గంటలకు లాగ్ అవుట్ చేయాలి. ఈ ప్రాంతాల్లో నాలెడ్జ్​సిటీ, నాలెడ్జ్ పార్క్, టీహబ్, గెలాక్సీ, ఎల్​టీఐ అండ్​ ట్విజ, స్కైవ్యూ, దివ్యశ్రీ ఓరియన్​ బిల్డింగ్​లోని కంపెనీలు ఉన్నాయి. 

ఫేజ్​3: మధ్యాహ్నం 3 నుంచి  సాయంత్రం 6 గంటలు 

ఫైనాన్షియల్ డిస్ర్టిక్ట్​, గచ్చిబౌలి ఏరియాల్లో ఉన్న ఐటీ కంపెనీల ఉద్యోగులు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల మధ్య లాగ్ అవుట్ చేయాలి. ఈ ప్రాంతాల్లో మైక్రోసాఫ్ట్​, ఇన్ఫోసిస్,​ విప్రో, సెంచురీస్, బ్రాడ్​వే, వర్చుసా, బీఎస్​ఆర్ ఐటీ పార్కు, ఐసీఐసీఐ, అమెజాన్, హనీవెల్, హిటాచీ, సత్వ క్యాపిటల్, క్యాప్​జెమినీ, క్యూసిటీ, వేవ్​రాక్, డీఎల్​ఎఫ్​లోని కంపెనీలు ఉన్నాయి.