
హైదరాబాద్ లో ఎవరైనా నిరసనలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు సైబరాబాద్ పోలీసులు. టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ కు నిరసనగా హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు చేస్తున్నారు. ఈ క్రమంలో సైబరాబాద్ పరిధిలో ధర్నాలకు ఎలాంటి పర్మిషన్ లేదని చెప్పారు.
పబ్లిక్ న్యూసెన్స్ కి, ట్రాఫిక్ కి కారణం కావొద్దని.. ప్రధాన రోడ్లు, ఓఆర్ ఆర్ లపై ధర్నా చేయాలనుకున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇప్పటికే పలువురిని ముందస్తు అరెస్ట్ చేసామని చెప్పారు.
ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి నిరసన కార్యక్రమాలు చేయొద్దన్నారు. ధర్నాలు చేసి విధ్వంసం చేయాలని సృష్టిస్తే.. మీరు పని చేసే కంపెనీలకు సైతం నోటీసులు ఇస్తామని చెప్పారు. సామాన్య ప్రజలకు, వారి విధులకు ట్రాఫిక్ కు ఇబ్బంది కలిగిస్తే ఊరుకునేది లేదని చెప్పారు.