
హైదరాబాద్ లో వర్షం దంచికొడుతుంది.. గురువారం ( సెప్టెంబర్ 25 ) సాయంత్రం మొదలైన వర్షం ఎడతెరపి లేకుండా కురుస్తోంది. శుక్రవారం, శనివారం ( సెప్టెంబర్ 26, 27 ) కూడా హైదరాబాద్ లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన క్రమాంలో.. ఇవాళ, రేపు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ ఇవ్వాలని సూచించారు సైబరాబాద్ పోలీసులు సూచించారు. ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటంతో గచ్చిబౌలి, హైటెక్ సిటీ ఏరియాల్లో ట్రాఫిక్ జామ్, వాటర్ లాగింగ్ సమస్యతో ఐటీ ఉద్యోగులు ఇబ్బంది తలెత్తకుండా.. ఈమేరకు సూచనలు చేశారు పోలీసులు.
ఇదిలా ఉండగా.. గురువారం అర్ధరాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. నగరంలోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఖైరతాబాద్, లక్డీకపూల్, ఎర్రమంజిల్, నాంపల్లి, దిల్ సుఖ్ నగర్, ఫిలింనగర్, పంజాగుట్ట, సోమాజిగూడ, అమీర్పేట, ఎస్సార్ నగర్, సనత్ నగర్, ఎర్రగడ్డ, చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా, సంతోష్ నగర్, కాంచన్ బాగ్, బండ్ల గూడ, ఛత్రినాక, శాలిబండ, బేగంపేట్, రాణిగంజ్, ప్యారాడైజ్, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, జేబీఎస్, బోయిన్ పల్లి, మారేడు పల్లి, అడ్డగుట్ట, మెట్టుగూడ, సీతాఫల్ మండి.. బన్సీలాల్ పేట్, మోండా మార్కెట్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, ఉప్పల్, హబ్సిగూడ, తార్నాక తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది.
— Cyberabad Traffic Police (@CYBTRAFFIC) September 26, 2025
అర్ధరాత్రి నుంచి కంటిన్యూగా వర్షం పడుతుండటంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఉదయాన్ని ఆఫీసులకు వెళ్లే వారు అవస్థలు పడుతున్నారు. వర్షపు నీరు రోడ్లపైకి చేరడంతో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అయ్యింది. దీంతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వాతావరణ, ప్రభుత్వ హెచ్చరికల నేపథ్యంలో ఇప్పటికే జీహెచ్ఎంసీ, హైడ్రా, మాన్ సూన్ ఎమర్జెన్సీ టీములు అప్రమత్తమయ్యాయి. వరద ప్రభావిత ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో సహయక చర్యలు చేపట్టాయి. రాబోయే రెండు గంటల పాటు హైదరాబాద్ లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.