హైదరాబాద్ సిటీలో ఫంక్షన్స్ చేసుకుంటున్నారా..? 100కు మించి జనం వస్తే చెత్త నిర్వహణ నిర్వాహకులదే..!

హైదరాబాద్ సిటీలో ఫంక్షన్స్ చేసుకుంటున్నారా..? 100కు మించి జనం వస్తే చెత్త నిర్వహణ నిర్వాహకులదే..!
  • మూడు రోజుల ముందే పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయాలి: సీఎంసీ గైడ్​లైన్స్​ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: సైబరాబాద్​ పరిధిలో ఇక నుంచి వేడుకలు, సభలు, సమావేశాలు నిర్వహించినప్పుడు 100 మందికి మించి జనం వచ్చే అవకాశం ఉంటే మూడు రోజుల ముందే సెంట్రల్​పీసీబీలోని ఈవెంట్ ఇంటిమేషన్ పోర్టల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయాలి. ఈ మేరకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బుధవారం గైడ్​లైన్స్​జారీ చేసింది. సాలిడ్ వేస్ట్ మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ రూల్స్ ప్రకారం 100 మందికి పైగా పాల్గొనే కార్యక్రమాల్లో నిర్వాహకులే చెత్తను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా ఏర్పాట్లు చేసుకోవాలని కోరింది.

తడి, పొడి, ఇతర కేటగిరీలుగా చెత్తను వేరు చేయాలని, సేకరించిన వ్యర్థాలను సీఎంసీ గుర్తించిన చెత్త సేకరణ ఏజెన్సీలకు అప్పగించాలని కోరింది. ట్రాన్స్​పోర్టేషన్ ఏర్పాట్లు కూడా నిర్వాహకులే చేసుకోవాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రజల్లో, కార్యక్రమాల నిర్వాహకుల్లో అవగాహన కల్పించాలని డీసీలకు కమిషనర్ సృజన సూచించారు.