
- శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ఫేజ్–2 పనుల కారణంగా ట్రాఫిక్ డైవర్షన్స్
గచ్చిబౌలి, వెలుగు : గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ను వారం రోజుల పాటు క్లోజ్చేస్తున్నట్లు సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్సీపీ జోయల్‌డేవిస్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. ఔటర్‌రింగ్‌రోడ్డు నుంచి కొండాపూర్ రూట్లో జరుగుతున్న శిల్పా లేఅవుట్ ఫ్లైఓవర్ ఫేజ్–2 నిర్మాణ పనుల కారణంగా ట్రాఫిక్ఆంక్షలు అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. 19 నుంచి 26వ తేదీ వరకు రోజూ అర్ధరాత్రి 11 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు గచ్చిబౌలి ఫ్లైఓవర్‌ను క్లోజ్ చేస్తున్నట్లు చెప్పారు.
ఈ రూట్లో ట్రాఫిక్ డైవర్షన్ అమలులో ఉంటాయన్నారు. బయోడైవర్సిటీ జంక్షన్ నుంచి ఐఐఐటీ జంక్షన్వైపు వెళ్లే వాహనదారులు ఫ్లైఓవర్ కింది నుంచి టెలికాం నగర్, గచ్చిబౌలి జంక్షన్మీదుగా వెళ్లాలి. ఐఐఐటీ జంక్షన్‌నుంచి బయోడైవర్సిటీ జంక్షన్ వైపు వెళ్లే వాహనదారులు ఫ్లైఓవర్పక్క నుంచి గచ్చిబౌలి జంక్షన్ మీదుగా వెళ్లాలి.