సెల్‌ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీస్‌ శాఖ టాప్.. ఇప్పటి వరకు ఎన్ని ఫోన్లు రికవరీ చేశారంటే..

సెల్‌ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీస్‌ శాఖ టాప్.. ఇప్పటి వరకు ఎన్ని ఫోన్లు రికవరీ చేశారంటే..

సెల్‌ఫోన్ల రికవరీలో తెలంగాణ పోలీస్‌శాఖ టాప్ ప్లేస్ సాధించింది. దేశవ్యాప్తంగా అత్యధికంగా సెల్ ఫోన్లను రికవరీ చేసి టాప్ లో నిలిచింది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజస్టర్ (CEIR) పోర్టల్ లో తెలంగాణ ఆలస్యంగా జాయిన్ అయినప్పటికీ తెలంగాణ పోలీస్ శాఖ ఈ ఫీట్ సాధించినట్లు ప్రకటన వెలువరించింది. 

CEIR పోర్టల్‌ ద్వారా ఇప్పటి వరకు 78 వేల114 సెల్‌ఫోన్ల రికవరీ చేశారు పోలీసులు. అందులో హైదరాబాద్ కమిషనరేట్  లో 11 వేల879, సైబరాబాద్ కమిషనరేట్ లో 10 వేల385, 
రాచకొండ కమిషనరేట్  లో 8 వేల681  ఫోన్లను రికవరీ చేశారు. ఈ సందర్భంగా సెల్ ఫోన్లు రికవరీ చేసిన పోలీసులను అభినందించారు DG- CID శిఖా గోయల్. 

CEIR పోర్టల్‌ ఏ రాష్ట్రం ఎప్పుడు జాన్ అయ్యింది..?

CEIR పోర్టల్‌ కేంద్ర ప్రభుత్వం 2022, సెప్టెంబర్ 5న ఏర్పాటు చేసింది. పైలట్ ప్రాజెక్టు కింద మొదట కర్ణాటక, మహారాష్ట్ర, ఢిల్లీతో పాటు ఈశాన్య రాష్ట్రాలు జాయిన్ అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం 227 రోజుల తర్వాత అంటే 2023 ఏప్రిల్ 19 ఈ పోర్టల్ లో చేరింది. 227 రోజుల తర్వాత ఈ పోర్టల్ లో చేరినప్పటికీ.. తెలంగాణ అత్యధిక ఫోన్ల రికవరీతో టాప్ ప్లేస్ నిలవడం విశేషం. 2025 మే19 వరకు మొత్తం 78 వేల114 సెల్‌ఫోన్ల రికవరీ చేసి రికార్డు క్రియేట్ చేసిందని ఈ సందర్భంగా డీజీ శిఖాగోయల్ తెలిపారు.