CSK vs RR: విజయంతో సీజన్ ముగించిన రాజస్థాన్.. భారీ స్కోర్ చేసి చిత్తుగా ఓడిన చెన్నై

CSK vs RR: విజయంతో సీజన్ ముగించిన రాజస్థాన్.. భారీ స్కోర్ చేసి చిత్తుగా ఓడిన చెన్నై

ఐపీఎల్ 2025 లో రాజస్థాన్ రాయల్స్ నాలుగో విజయాన్ని అందుకుంది. సోమవారం (మే 20) ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో అలవోకగా గెలిచింది. భారీ ఛేజింగ్ లో వైభవ్ సూర్యవంశీ (57) అదరగొట్టడంతో పాటు కెప్టెన్ సంజు శాంసన్ (41) కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. చివరి మ్యాచ్ లో విజయంతో రాజస్థాన్ ఈ సీజన్ ను ముగించడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో రాజస్థాన్ 17.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసి గెలిచింది.   

ALSO READ | IPL 2025: బీసీసీఐ కొత్త రూల్.. అర్ధరాత్రి 1:15 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు

188 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ కు ఓపెనర్లు జైశ్వాల్, సూర్యవంశీ శుభారంభం ఇచ్చారు. తొలి రెండు ఓవర్లలో పరుగులు రాకపోయినా మూడో ఓవర్లో జైశ్వాల్ (36) బౌండరీల వర్షం పారించాడు. ఖలీల్ వేసిన ఈ ఓవర్లో మూడు ఫోర్లు, ఒక సిక్సర్ తో 19 పరుగులు రాబట్టాడు. మంచి టచ్ లో కనిపించిన జైశ్వాల్ భారీ షాట్ కు ప్రయత్నించి నాలుగో ఓవర్లో ఔటయ్యాడు. జైశ్వాల్ మెరుపులతో పవర్ ప్లే లో రాజస్థాన్ వికెట్ నష్టానికి 56 పరుగులు చేసింది. 

ALSO READ | IPL 2025: బెంగళూరు బ్యాడ్‌లక్.. RCB, సన్ రైజర్స్ మ్యాచ్‌కు వేదిక మార్చిన బీసీసీఐ

జైశ్వాల్ ఔటైనా సూర్యవంశీ, సంజు శాంసన్ ఇన్నింగ్స్ ను ముందుకు తీసుకెళ్లారు. నూర్ అహ్మద్ వేసిన 8 ఓవర్ లో చివరి మూడు బంతులను వైభవ్ వరుసగా 6,4,4 కొట్టి దూకుడు చూపించాడు. జడేజా వేసిన 11 ఓవర్లో మరో రెండు సిక్సర్లు కొట్టి మ్యాచ్ ను రాజస్థాన్ చేతుల్లోకి తీసుకొచ్చాడు. ఈ క్రమంలో 27 బంతుల్లోనే సూర్యవంశీ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రెండో వికెట్ కు వీరిద్దరూ 59 బంతుల్లోనే 98 పరుగులు జోడించి జట్టును విజయ తీరాలకు చేర్చారు. వీరిద్దరూ ఔటైనా జురెల్ (12 బంతుల్లో 31) వేగంగా ఆడుతూ జట్టుకు విజయాన్ని అందించాడు. చెన్నై బౌలర్లలో అశ్విన్ రెండు.. కంబోజ్, నూర్ అహ్మద్ తలో వికెట్ తీసుకున్నారు.    

ALSO READ | IPL 2025: పంజాబ్, గుజరాత్‌కు బంపర్ ఛాన్స్.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ వేదికలు ఇవే!

అంతకముందు టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ టార్గెట్ ను రాజస్థాన్ ముందు ఉంచింది. 78 పరుగులకే సగం జట్టు పెవిలియన్ కు చేరినా బ్రేవీస్ (42), దూబే (39) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. రాజస్థాన్ బౌలర్లలో  యుధ్వీర్ సింగ్ చరక్, ఆకాష్ మద్వల్ తలో మూడు వికెట్లు తీసుకున్నారు. తుషార్ దేశ్ పాండే, వానిందు హసరంగా తలో వికెట్ తీసుకున్నారు.