
హర్యానా: పాకిస్తాన్‌కు స్పై ఏజెంట్గా పని చేస్తూ దొరికిన హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పర్సనల్ డైరీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆ డైరీలో కొన్ని కీలక విషయాలను జ్యోతి మల్హోత్రా రాసుకుంది. ఆమె ఆలోచనలను, బార్డర్ దాటి పాకిస్తాన్ ట్రిప్కు వెళ్లొచ్చాక పాకిస్తాన్ ఆతిథ్యంపై జ్యోతి పొగడ్తలు కురిపించింది. పాకిస్తాన్ విజిట్ గురించి మాటల్లో చెప్పలేనని తన డైరీలో రాసుకొచ్చింది.
పది రోజుల పాటు జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్ ట్రిప్ సాగింది. అయితే.. ఆమె తన డైరీలో పాకిస్తాన్ విజిట్ గురించి రాసుకొచ్చినప్పటికీ తేదీని ఎక్కడా ప్రస్తావించలేదు. భారత్లోని హిందువులు పాకిస్తాన్లోని తమ పూర్వీకుల ప్రదేశాలను సందర్శించాలని ఆమె రాసుకొచ్చింది. పాకిస్తాన్, చైనా దేశాలను ఆమె విజిట్ చేసినట్లు విచారణలో తేలింది. తనకు ఢిల్లీకి వెళుతున్నానని చెప్పిందని, పాకిస్తాన్ అని తమకు చెప్పలేదని జ్యోతి తండ్రి మీడియాకు చెప్పారు. పహల్గాం దాడి జరగడానికి 3 నెలల ముందే ఆ ప్రాంతానికి జ్యోతి వెళ్లినట్లు మన నిఘా వర్గాలు గుర్తించాయి.
ALSO READ | ప్రాణాలు ముఖ్యం బిగులు.. భయంతో పాక్ సైనికులకు ఆర్మీ కమాండర్ ఆర్డర్, ఆడియో లీక్..
పహల్గాం వెళ్లి అక్కడి వీడియోలు, ఫొటోలు తీసినట్లు తెలుస్తున్నది. ఆ సమాచారాన్ని పాకిస్తాన్ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈమె ఇచ్చిన ఇన్పుట్స్ ఆధారంగానే టెర్రరిస్టులు రెక్కీ నిర్వహించి దాడి చేసినట్లు అనుమానిస్తున్నారు. పహల్గాం దాడికి ముందు ఆమె పాకిస్తాన్తో పాటు చైనాకు కూడా వెళ్లొచ్చింది.
పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ (పీఐవో) ఆమెను ఓ అసెట్గా డెవలప్ చేసుకున్నట్లు మన నిఘా వర్గాలు గుర్తించాయి. మే 16న ఆమెను అరెస్ట్ చేసి 5 రోజులు రిమాండ్కు పంపగా.. ఇప్పుడు హర్యానా పోలీస్ కస్టడీలో ఉంది. ఆ రాష్ట్ర పోలీసులు, కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆమెను విచారిస్తున్నాయి.