
- సహనం కోల్పోయి మాట్లాడితే ప్రజలు ఒప్పుకోరు
- నేను ఇండిపెండెంట్కాదు
జగిత్యాల: ‘ నేను ఇండిపెండెంట్కాదు. సేవ చేసే కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చా. ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేగా భారీ మోజార్టీతో గెలిచి జగిత్యాలను అన్ని విధాలుగా అభివృద్ది చేస్తున్న.. గాంధీభవన్ లో కూర్చొని జీవన్‌రెడ్డి నన్ను ఇండిపెండెంట్అంటున్నాడు. కాంగ్రెస్ పార్టీలో అత్యధికంగా ఓటమి పాలైనది జీవన్‌రెడ్డి. ఐదుసార్ల ఎమ్మెల్యేగా.. మూడు సార్లు ఎంపీగా ఓడిపోయారు. ఆయన ఏం చేయలేదనే ప్రజలు గెలిపించలేదు.’ అని జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఇవాళ జగిత్యాలలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా జగిత్యాలలో డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజూరు చేయించిన్నట్లు చెప్పారు.
ALSO READ | నెలాఖరులోగా 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి పొంగులేటి
‘భూస్వాములు అని సంబోధిస్తున్నారు.. మేం ఏ అరాచకాలు చేయలేదు. మమ్మల్ని ఎవరూ చంపలేదు. మేం ఊరు విడిచి వెళ్లలేదు. మీడియా ముఖంగా శ్రీనన్న కొడుకు బీజేపీ అభ్యర్థి అరవింద్ కు ఓటు వేయాలని జీవన్‌రెడ్డి చెప్పలేదా..? ఎవరు ఏ అభివృద్ధి చేశారో జగిత్యాల ప్రజలు చూసే జీవన్ రెడ్డి ని ఓడగొట్టారు.. నన్ను గెలిపించారు.. జీవన్ రెడ్డి అనుచరులు సోషల్ మీడియా లో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు.
నేను అలాంటివి సహించను.. సహనం కోల్పోయి జీవన్ రెడ్డి మాట్లాడుతున్నారు.. ప్రజలు ఒప్పుకోరు. జీవన్‌రెడ్డి రాష్ట్ర, దేశ అభివృద్ధికి సలహాలు ఇవ్వండి. హుందాతనం కోల్పోవద్దు’ అని సంజయ్ అన్నారు.