నెలాఖరులోగా 4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు: మంత్రి పొంగులేటి

 నెలాఖరులోగా  4 లక్షల ఇందిరమ్మ ఇండ్లు:  మంత్రి పొంగులేటి

= కబ్జా కాలాన్ని తీసేసి భూ దందాలు చేశారన్న 
     చెన్నూరు ఎమ్మెల్యే వివేక్​ 
 = మంచిర్యాల జిల్లాలో భూ భారతి అవగాహన సదస్సు 

కోల్ బెల్ట్/జైపూర్ : బీఆర్ఎస్​హయాంలో  అన్యాక్రాంతానికి గురైన భూములను మళ్లీ తిరిగి  పేదవారికి పంచుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదోళ్లకు భరోసా కల్పించే విధంగా కాంగ్రెస్​ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఇవాళ  మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో  జడ్పీ హైస్కూల్ లో  నిర్వహించిన భూ భారతి కొత్త చట్టం పై అవగాహన సదస్సుకు చెన్నూర్ ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి,బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకట స్వామితో కలిసి పాల్గొన్నారు.  

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ భూముల్లో సాగుచేస్తున్న రైతుల వివరాలు సర్వే చేయించి పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ‘ఆధార్ కార్డు తరహా  భూ ధార్ కార్డును తీసుకొని రావడం జరిగింది.  సర్వే చేసి సర్వే మ్యాప్ ను పాస్ బుక్ లో పొందుపరుస్తాం.  నాలుగున్నర లక్షల ఇందిరమ్మ ఇండ్లను ఈ నెలాఖరు లోగా స్టార్ట్ చేస్తున్నం.   

రాబోయే సంవత్సరాల్లో 20 లక్షల ఇండ్లను కట్టిస్తాను.  చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి  మాట్లాడుతూ..మాజీ సీఎం రాత్రికి రాత్రే భూ దందాలు చేయడానికే ధరణిచట్టాన్ని తీసుకొచ్చారన్నారు.  కావాలనే కొంత మంది భూములను ప్రోహిబిట్ లో పెట్టి దందాలు చేశారన్నారు. ‘ కబ్జా కాలాన్ని తీసేసి యజమానుల నుండి దందాలు చేశారు.  భూ దందాలలో ఎలాంటి అక్రమాలు చోటు చేసుకోకుండా ఈ భూ భారతి చట్టాన్ని తీసుకువచ్చాం.  బెల్లంపల్లి ఎమ్మెల్యే  గడ్డం వినోద్​ మాట్లాడుతూ.. భూ భారతి చట్టం ద్వారా రైతులకు మేలు జరుగుతుందన్నారు.