బెంగళూరు భారీ వర్షాలపై అలర్ట్.. ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’ అడగండి.. ఎందుకంటే..

బెంగళూరు భారీ వర్షాలపై అలర్ట్.. ఉద్యోగులు ‘వర్క్ ఫ్రం హోం’ అడగండి.. ఎందుకంటే..

బెంగళూరు: బెంగళూరును భారీ వర్షాలు ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. రానున్న మూడు రోజుల పాటు కర్ణాటకలో.. మరీ ముఖ్యంగా బెంగళూరులో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో.. బెంగళూరు ప్రజలు భయాందోళనలో ఉన్నారు. ఇప్పటికే కురిసిన భారీ వర్షాల కారణంగా బెంగళూరు రోడ్లు నదులను తలపిస్తున్నాయి. ఐటీ కంపెనీల డెస్కుల్లోకి కూడా నీళ్లు వెళ్లాయి. వరదల కారణంగా సుమారు 10 మంది చనిపోయారు.

ఉరుములు, ఈదురు గాలులు, వడగండ్ల వానతో బెంగళూరు సిటీ అతలాకుతలం అయింది. చెట్లు నేలకూలాయి, కార్లు, బండ్లు వరదలో కొట్టుకుపోయాయి. పలు ప్రాంతాలకు కరెంట్ కట్ అయింది. నగరంలోని చాలా ప్రాంతాలను వరద ముంచెత్తింది. దీంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. అధికారులు హై అలర్ట్ ప్రకటించి, సహాయక చర్యలు చేపట్టారు. ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం ఇవ్వాలన్న ప్రతిపాదన తెరపైకొచ్చింది. ఆఫీసులకు వెళ్లి ఉద్యోగాలు చేయడానికి నానా పాట్లు పడుతున్నారు. ట్రాఫిక్ సమస్యతో పబ్లిక్ తిప్పలు పడుతున్నారు. ఉద్యో్గాలు చేసే ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం అడిగి ఇంట్లోనే కూర్చుని వర్క్ చేసుకోవడం బెటర్.

ALSO READ | జస్ట్ మిస్.. అలర్ట్గా లేకపోయి ఉంటే.. లారీ టైర్ల కింద స్కూటీ బదులు ఈమె ఉండేది..!

భారీ వర్షం కారణంగా బెంగళూరు నగరంలోని హెచ్ఎస్ఆర్ లేఔట్, సిల్క్ బోర్డ్ మెట్రో స్టేషన్, శాంతి నగర్, కంతీరవ స్టేడియం సహా మరిన్ని ప్రాంతాలు నీట మునిగాయి. ప్రస్తుతం ఐటీ నగరం వర్షంలో మునిగిన స్టేడియంను తలపిస్తుందని బెంగళూరు ప్రజలు నెట్టింట సెటైర్లు పేల్చుతున్నారు. నగరంలోని మౌళిక సదుపాయాలు ఎంత అధ్వానంగా ఉన్నాయో ఒక్క వర్షంతో బయటపడిందని నెటిజన్లు వీడియోలు షేర్ చేశారు.