
సైబర్ క్రిమినల్స్ ఏ టైమ్ లో ఎలా డబ్బులు కొట్టేస్తారో అర్ధం కాని పరిస్థితి. ఫోన్ హ్యాక్ అయ్యిందనీ.. ఆధార్ అప్డేట్ ఓటీపీ అనీ.. బ్యాంక్ అకౌంట్ అనీ.. ఇలా రకరకాలుగా ఫోన్ చేసి లేని పోని భయాలు కల్పించి తేరుకునేలోపే లక్షల డబ్బును కొట్టేస్తున్నారు. లేటెస్ట్ గా ఇలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది. పహల్గాం దాడికి టెర్రరిస్టులకు ఫండ్ రైజ్ చేశారని బెదిరించి ఏకంగా 26 లక్షల రూపాయలు కాజేసిన ఘటన సంచలనంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్కు చెందిన 68 ఏళ్ల రిటైర్డ్ ఉద్యోగికి యాంటి టెర్రర్ స్వాడ్ పేరుతో కాల్ చేశారు దుండగులు. పహల్గం ఉగ్రవాదులకు ఫండ్ రైస్ చేశారని దబాయించారు. ఉగ్రవాదులతో సంబంధాలున్నాయనీ.. మనీలాండరింగ్ జరిగిందని బాదితుడినీ భయపెట్టారు నేరస్తులు. డిజిటల్ అరెస్టు ఉంటుందని బెదిరించారు.
దీంతో భయాందోళనకు గురైన బాధితుడు.. నిందితులు డిమాండ్ చేసిన 26 లక్షల 6 వేల రూపాయలు చెల్లించాడు. తన ఫిక్స్డ్ డిపాజిట్తో పాటు.. తన భార్య పేరు మీద 20 లక్షల రూపాయలు సైబర్ క్రిమినల్ కు చెల్లించాడు.
ఆ తర్వాత విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో మోసపోయావని చెప్పడంతో అసలు నిజం గ్రహించాడు నిందితుడు. వెంటనే 1930 కు కాల్ చేసి ఫిర్యాదు చేశాడు.
ఈ సందర్భంగా సైబర్ నేరస్తులు చేసే కాల్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. డిజిటల్ అరెస్ట్ అనే చర్య ఉండదని చెప్పారు. ఎవరైనా కాల్ చేసి డిజిటల్ అరెస్ట్ అని మభ్యపెడితే వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.