Cyber Crime: డ్రగ్స్‌‌‌‌ స్మగ్లింగ్‌‌‌‌ కేసులు నమోదు అయ్యాయని.. మహిళను బెదిరించి రూ 2.17 లక్షలు వసూలు

Cyber Crime:  డ్రగ్స్‌‌‌‌ స్మగ్లింగ్‌‌‌‌ కేసులు నమోదు అయ్యాయని.. మహిళను బెదిరించి రూ 2.17 లక్షలు వసూలు
  • డ్రగ్స్‌‌‌‌ పార్శిల్‌‌‌‌ చేస్తున్నారంటూ సైబర్‌‌‌‌ మోసం
  • మహిళ నుంచి రూ. 2.17 లక్షలు వసూలు

బషీర్‌‌‌‌బాగ్‌‌‌‌, వెలుగు: డ్రగ్స్‌‌‌‌తో ఉన్న పార్శిల్‌‌‌‌ను పంపుతున్నారంటూ సైబర్‌‌‌‌ నేరగాళ్లు ఓ మహిళను బెదిరించి రూ. 2.17 లక్షలు వసూలు చేశారు. హైదరాబాద్‌‌‌‌ సైబర్‌‌‌‌ క్రైమ్‌‌‌‌ ఏసీపీ శివమారుతి తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌‌‌‌లో ప్రైవేట్‌‌‌‌ ఉద్యోగం చేస్తున్న ఓ మహిళకు ముంబై పోలీసులమంటూ ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌‌‌‌ చేశారు.

 మహిళ పేరున ముంబై నుంచి తైవాన్‌‌‌‌కు ఓ పార్శిల్‌‌‌‌ వెళ్తుందని అందులో ఐదు పాస్‌‌‌‌ పోర్ట్స్‌‌‌‌, ఐదు ఏటీఎం కార్డ్స్, 4.2 కేజీల దుస్తులు, ఒక ల్యాప్‌‌‌‌టాప్‌‌‌‌, ఐదువేల యూఎస్‌‌‌‌ డాలర్లతో 200 గ్రాముల డ్రగ్స్‌‌‌‌ ఉన్నాయని చెప్పారు. 

కాల్ కట్‌‌‌‌ చేయకుండా లైన్‌‌‌‌లోనే ఉండాలని, లేకపోతే స్థానిక పోలీసులు అరెస్ట్‌‌‌‌ చేస్తారని, మనీ ల్యాండరింగ్‌‌‌‌, డ్రగ్స్‌‌‌‌ స్మగ్లింగ్‌‌‌‌ కేసులు నమోదు అయ్యాయని మహిళను బెదిరించారు. మహిళకు ఎన్ని బ్యాంక్‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌ ఉన్నాయని, అందులో ఎంత డబ్బు ఉందని ఆరా తీశారు. 

అనంతరం అకౌంట్‌‌‌‌లో ఉన్న డబ్బులను తమకు ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ చేయాలని, వెరిఫై చేసిన తర్వాత తిరిగి పంపుతామని నమ్మించారు. దీంతో నిజమైన పోలీసులే అని నమ్మిన మహిళ తన అకౌంట్‌‌‌‌లో ఉన్న రూ.2.17 లక్షలను వారికి ట్రాన్స్‌‌‌‌ఫర్‌‌‌‌ చేసింది. 

వెంటనే కాల్‌‌‌‌ డిస్‌‌‌‌కనెక్ట్‌‌‌‌ అయింది. తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మోసపోయానని గ్రహించి సైబర్‌‌‌‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఏసీపీ తెలిపారు.