తుఫాన్ బాధితులకు రూ. 6 వేల సాయం: సీఎం స్టాలిన్

తుఫాన్ బాధితులకు రూ. 6 వేల సాయం: సీఎం స్టాలిన్

చెన్నై: తమిళనాడులో మిగ్​జాం తుఫాను కారణంగా నష్టపోయిన కుటుంబాలకు ఒక్కక్కరికీ రూ.6 వేల చొప్పున పరిహారం గా అందిస్తామని ఆ స్టేట్ సీఎం ఎంకే స్టాలిన్ శనివారం ప్రకటించారు. వరదల కారణంగా దెబ్బతిన్న పంటలకు పరిహారాన్ని కూడా పెంచారు. నగదును రేషన్ షాపు ద్వారా చెల్లించనున్నట్టు తెలిపారు. వరదల కారణంగా జరిగిన నష్టంపై శనివారం అత్యున్నత స్థాయి సమావేశం జరిగింది. 

అనంతరం బాధితులకు నగదు సహాయంపై స్టాలిన్​ స్పందించారు. వర్షాల కారణంగా దెబ్బతిన్నపంటలకు నష్టపరిహారాన్ని హెక్టారుకు రూ.13,500 నుంచి రూ.17,000కు పెంచారు. శాశ్వత పంటలు, చెట్లు దెబ్బతిన్నట్లయితే హెక్టారుకు పరిహారాన్ని రూ.18 వేల నుంచి రూ.22,500కు, వర్షాధార పంటలకు హెక్టారుకు రూ.8,500 లకు పెంచారు. ప్రాణాలు కోల్పోయిన వారి బంధువులకు ఇచ్చే పరిహారాన్ని రూ. 5 లక్షలకు పెంచనున్నారు