సింగరేణిపై మొంథా పంజా..రూ. 80 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి విఘాతం

సింగరేణిపై మొంథా పంజా..రూ. 80 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి విఘాతం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిపై మొంథా ఎఫెక్ట్‌‌ పడింది. తుఫాన్‌‌ కారణంగా సింగరేణి వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండడంతో బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగింది. ఓపెన్‌‌ కాస్ట్‌‌ గనుల్లో బొగ్గు తవ్వలేని పరిస్థితులు ఏర్పడడంతో మంగళ, బుధవారాల్లో కలిపి సుమారు రూ. 80 కోట్ల విలువైన రెండు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి విఘాతం ఏర్పడింది. 

కొత్తగూడెం, ఇల్లెందు, మణుగూరు, రామగుండం, భూపాలపల్లి, శ్రీరాంపూర్, మందమర్రి ప్రాంతాల్లోని ఓసీల్లోకి వరద నీరు చేరింది. నీటిని బయటకు తోడేందుకు 16హెచ్‌‌పీ మోటార్ల నుంచి 280 హెచ్‌‌పీ మోటార్లను సిద్ధం చేశారు. పలు ఓపెన్‌‌ కాస్ట్‌‌లలో మెషినరీ వరద నీటిలో మునిగిపోకుండా ముందస్తు చర్యలు చేపట్టారు.