ఖమ్మం జిల్లాలో మోంథా తుఫాను బీభత్సం.. మధిరలో ఇండ్లలోకి చేరిన వరద నీరు..హైవేపై ధర్నాకు దిగిన స్థానికులు

ఖమ్మం జిల్లాలో మోంథా తుఫాను బీభత్సం.. మధిరలో ఇండ్లలోకి చేరిన వరద నీరు..హైవేపై ధర్నాకు దిగిన స్థానికులు

ఖమ్మం జిల్లాలో మోంథా తుఫాన్​ బీభత్సం సృష్టించింది.. తుఫాన్​ కారణంగా జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. దీంతో జిల్లాలో అనేక ప్రాంతాల్లో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఇండ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు ఆందోళన చెందారు. 

ఖమ్మం జిల్లాలలోని మధిర పట్టణంలో  మోంథా తుఫాన్​ కారణంగా భారీ వర్షం కురిసింది.. దీంతో మధిర మున్సిపాలిటీ పరిధిలోని ముస్లిం కాలనీని వరద ముంచెత్తింది. ఇండ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాలనీల్లో మోకాల్లోతు నీళ్లు నిలవడంతో దిక్కుతోచని స్థితిలో తమకు న్యాయం చేయాల ని ఆందోళన చేపట్టారు. 

ముస్లిం కాలనీ వాసులు రోడ్డెక్కారు. మధిర వైరా ప్రధాన రహదారిపై వాహనాలను అడ్డుకొని ధర్నా చేశారు. కాలనీ వాసులకు సీపీఎం నేతలు అండగా నిలిచారు.   వర్షం వచ్చినప్పుడల్లా తమ కాలనీ నీట మునిగి అవస్థలు పడుతున్నాం.. మా సమస్యను వెంటనే పరిష్కరించాలని ముస్లిం కాలనీ వాసులు డిమాండ్ చేశారు.

మరోవైపు ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం అంజనాపురం వాగు ఉప్పొంగి ప్రవహిస్తోంది. వాగు  ఉదృతంగా ప్రవహిస్తుండగా వరద నీటిలో డీసీఎం వ్యాన్​ డ్రైవర్​తో సహా కొట్టుకుపోయింది. లారీ డ్రైవర్​ ను రక్షించేందుకు అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.