పోలీస్ అమరుల స్మారకార్థం ‘సైక్లోథాన్’

పోలీస్ అమరుల స్మారకార్థం ‘సైక్లోథాన్’

పోలీసు స్మారక వారోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం సెంట్రల్ జోన్ సైక్లోథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి టోలిచౌకిలోని సెవెన్ టాంబ్స్ వరకు సైకిల్​ ర్యాలీ కొనసాగింది. 380 మంది సైక్లిస్టులు, 100 మంది పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సెంట్రల్ జోన్ డీసీపీ కె.శిల్పవల్లి,  సౌత్ జోన్ డీసీపీ స్నేహా మెహరా గెస్టులుగా హాజరయ్యారు.  – వెలుగు, హైదరాబాద్ సిటీ