హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ కంపెనీ సైయెంట్ లిమిటెడ్, ఆటోమేషన్ టెక్నాలజీని అందించే సీఎన్‌హెచ్ కన్‌స్ట్రక్షన్ ఎక్విప్‌మెంట్‌తో తమ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరుచుకుంది. వివిధ వెహికల్ ప్లాట్‌ఫారమ్‌లలో అధునాతన పర్సెప్షన్, ఆటోమేషన్ సామర్థ్యాలను అందించడంపై ఈ కంపెనీలు దృష్టి సారిస్తున్నాయి.
గత రెండేళ్లుగా ఇరు సంస్థలు కీలక ఇన్నోవేషన్ ప్రోగ్రామ్‌లలో కలిసి పనిచేశాయి. వీల్ లోడర్ల కోసం అడ్వాన్స్డ్ పర్సెప్షన్ సిస్టమ్స్‌ను డెవలప్ చేశాయి. ఈ సిస్టమ్స్ కేవలం ప్రారంభమేనని, భవిష్యత్తులో మరిన్ని ఆటోనమస్ పరిష్కారాలను డెవలప్ చేస్తామని సైయెంట్ సీఈఓ సుకమల్ బెనర్జీ పేర్కొన్నారు.
