
ద్విచక్రవాహనంపై సోడా బండి కోసం ఉపయోగించే సిలిండర్ తీసుకెళ్తుంటే పేలిన ఘటనలో ఇద్దరికి గాయాలు కాగా, కారు అద్దాలు ధ్వంసమైన ఘటన కేపీహెచ్‌బీ కాలనీ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం హైటెక్‌సిటీ నుండి అనిల్(19), హర్షిత్(12) ద్విచక్ర వాహనంపై సిలిండర్‌ను తరలిస్తున్నారు. జేఎన్టీయూ ఫ్లైఓవర్ మంజీరా మాల్ వద్దకు చేరుకోగానే సిలిండర్జారి కిందపడి పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి అదే రూట్లో వస్తున్న కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. కారు యజమానికి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ నర్సింహులు చెప్పారు.