RaoBahadur: వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్తో.. మహేష్ బాబు మూవీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

RaoBahadur: వర్సటైల్ యాక్టర్ సత్యదేవ్తో.. మహేష్ బాబు మూవీ.. ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్

నటుడు, స్క్రీన్ రైటర్, దర్శకుడు వెంకటేష్ మహా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆయన C/oకంచరపాలెం (2018) మరియు ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య (2020) వంటి సినిమాలను డైరెక్ట్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

మరీ ముఖ్యంగా.. ఈ సినిమాలతో తనలోని వైవిధ్యతను చాటుకుని సినీ ఫ్యాన్స్ని తనవైపు తిప్పుకున్నారు. కానీ, డైరెక్టర్గా సినిమాలు తీసి దాదాపు 5 ఏళ్లు అవుతుంది. ఈ క్రమంలో త‌న కొత్త సినిమా కోసం ఆడియన్స్ తెగ వెయిట్ చేస్తూ వస్తున్నారు. ఇక వారి ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడింది. 

లేటెస్ట్గా దర్శకుడు వెంకటేష్ మహా తన కొత్త సినిమా అనౌన్స్ చేశాడు.‘రావు బహదూర్’ (Rao Bahadur) అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేశాడు. ఇందులో వర్సటైల్ యాక్టర్ స‌త్య‌దేవ్ ‘రావు బహదూర్’అనే జ‌మీందార్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు ఫస్ట్ లుక్ ద్వారా రివీల్ చేశాడు.

గుర్తుంచుకోండి.. “అనుమానం పెనుభూతం”అనే క్యాప్షన్ ఇచ్చి సినిమాపై క్యూరియాసిటీ కలిగించారు. ఇకపోతే, వృద్ధుడి పాత్ర‌లో స‌త్య‌దేవ్ మేకోవర్ ఆసక్తిగా ఉంది. అసలు ఇతను సత్యదేవ్? లేక మరొక నటుడా? అనే విధంగా ఉంది. 

ఈ సినిమాని మహేష్ బాబు ప్రొడక్షన్ హౌస్ GMB,శ్రీచ‌క్ర ఎంట‌ర్‌టైన‌మెంట్స్ బ్యాన‌ర్‌ల‌పై అనురాగ్ రెడ్డి, చింత గోపాల‌కృష్ణ రెడ్డి, శ‌ర‌త్ చంద్ర‌ నిర్మిస్తున్నారు. ఈ మూవీ 2026 స‌మ్మ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుందని మేకర్స్ పోస్టర్ ద్వారా వెల్లడించారు. 

GMBఎంటర్‌టైన్‌మెంట్స్:

GMBప్రొడక్షన్ హౌస్.. మహేష్ బాబు హీరోగా నటించిన సరిలేరు నీకెవ్వరు, సర్కారు వారి పాట సినిమాలను నిర్మించింది. ఈ సంస్థ సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్ ప్రొడక్షన్స్‌తో కలిసి అడవిశేష్ హీరోగా 'మేజర్' సినిమా నిర్మించి భారీ సక్సెస్ అందుకుంది. ఇప్పుడు మరో వినూత్న కథతో వస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.