రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు కీలకం.. ట్రాన్స్‎ఫోర్ట్ మంచిగుంటనే కంపెనీలు వస్తయ్: మంత్రి కోమటిరెడ్డి

రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు కీలకం.. ట్రాన్స్‎ఫోర్ట్ మంచిగుంటనే కంపెనీలు వస్తయ్: మంత్రి కోమటిరెడ్డి

హైదరాబాద్: రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు కీలకమని.. ట్రాన్స్‎ఫోర్ట్ మంచిగుంటనే కంపెనీలు వస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మంగళవారం (ఆగస్ట్ 12) హైదరాబాద్‎లోని హెచ్ఐసీసీ నాక్ ఆడిటోరియంలో హమ్ ప్రాజెక్టు రోడ్లపై కీలక సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క ముఖ్య అతిథులుగా ఈ సమావేశానికి హాజరయ్యారు. 

ఈ సందర్భంగా హమ్ ప్రాజెక్ట్ విజన్ డాక్యుమెంట్‎ను ఆవిష్కరించారు మంత్రులు. అనంతరం మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో రోడ్ల కోసం రూ.6500 కోట్లు సాంక్షన్ చేశామని తెలిపారు. రోడ్లు అన్ని మండల హెడ్ క్వార్టర్స్, అక్కడి నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్‎కు, అక్కడి నుంచి పట్టణాలకు కనెక్టివిటీ ఉండేలా వేస్తామని చెప్పారు. మొదటి దశలో దాదాపు 15 ప్యాకేజీల రోడ్లు వేస్తామన్నారు. రాష్ట్రంలో రోడ్లు బాగుంటేనే పరిశ్రమలు వస్తాయని పేర్కొన్నారు. 

కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పార్టీలకు అతీతంగా రాష్ట్రలకు రోడ్లు కేటాయిస్తున్నారని తెలిపారు. కల్వకుర్తి నుంచి శ్రీశైలం వరకు జాతీయ రహదారి సాంక్షన్ చేస్తామని గడ్కరీ హామీ ఇచ్చారన్నారు. రోడ్ల కోసం నిధులు ఇస్తున్న ఫారెస్ట్ అనుమతులు ఆలస్యం అవుతున్నాయని గడ్కరీ చెప్పారని అన్నారు. హై స్పీడ్ ట్రైన్స్, గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం ఏపీ బైఫర్కేషన్‎లోనే ఉందని.. రోడ్ల పనులు వెంటనే మొదలు పెట్టాలని సీఎం చెప్పారన్నారు. టైం బాండ్ లోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. రోడ్ల నిర్మాణంలో కాంట్రాక్టర్లు క్వాలిటీని పాటించాలని సూచించారు. మనం పబ్లిక్ మనీతో పనులు చేస్తున్నామనే విషయం గుర్తు పెట్టుకోవాలని చెప్పారు.