తిరుమలకు కారులో వెళుతున్నారా.. ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే కొండపైకి నో ఎంట్రీ.. ఎప్పటి నుంచి అంటే..

తిరుమలకు కారులో వెళుతున్నారా.. ఫాస్ట్ ట్యాగ్ లేకపోతే కొండపైకి నో ఎంట్రీ.. ఎప్పటి నుంచి అంటే..

కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్లే భక్తుల రద్దీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇక సంక్రాంతి, వైకుంఠ ఏకాదశి వంటి పండుగలు, బ్రహ్మోత్సవాలు వంటి ప్రత్యేక సందర్భాలు, సెలవుల సమయంలో రద్దీ విపరీతంగా ఉంటుంది. ఒక్కోసారి రద్దీని కంట్రోల్ చేయడం టీటీడీకి కూడా తలనొప్పిగా మారిన సందర్భాలు కూడా చూశాం. ఈ సమస్యకు చెక్ చెప్పేందుకు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించే దృష్ట్యా సరికొత్త ఐడియాతో ముందుకొచ్చింది టీటీడీ. ఇకపై తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం ప్రకటించింది టీటీడీ.

టీటీడీ తీసుకొచ్చిన ఈ నూతన విధానం ఆగస్టు 15 నుంచి అమల్లోకి రానున్నట్లు తెలిపింది. అలిపిరి తనిఖీ కేంద్రం వద్ద వివిధ వాహనాల్లో చేరుకునే భక్తులకు మెరుగైన భద్రతా ప్రమాణాలు, అధిక రద్దీ నివారణ, పారదర్శక సేవలు అందించే దృష్ట్యా ఆగస్టు 15వ తారీకు నుండి తిరుమలకు వెళ్లే వాహనాలకు ఫాస్ట్ టాగ్ తప్పనిసరి చేయడం జరిగిందని తెలిపింది టీటీడీ. ఇకపై ఫాస్ట్ టాగ్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించడం జరగదని స్పష్టం చేసింది టీటీడీ.

►ALSO READ | టీటీడీకి రూ. కోటి 10 లక్షలు విరాళం ఇచ్చిన హైదరాబాద్ పారిశ్రామికవేత్త..

ఫాస్ట్ ట్యాగ్ లేని వాహనదారుల కోసం అలిపిరి కేంద్రం దగ్గర ఐసీఐసీఐ బ్యాంకు వారి ఫాస్ట్ ట్యాగ్ జారీ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. ఫాస్ట్ ట్యాగ్ లేనివారికి ఐసీఐసీఐ సిబ్బంది అతితక్కువ సమయంలో ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేట్ చేస్తారని.. ఫాస్ట్ ట్యాగ్ యాక్టివేట్ చేసుకున్నవారినే తిరుమలకు అనుమతిస్తారని తెలిపింది టీటీడీ. మరి, అధిక రద్దీ నిర్వహణ కోసం టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం ఏ మేరకు ఫలితాన్ని ఇస్తుందో చూడాలి.