టీటీడీకి రూ. కోటి 10 లక్షలు విరాళం ఇచ్చిన హైదరాబాద్ పారిశ్రామికవేత్త..

టీటీడీకి రూ. కోటి 10 లక్షలు విరాళం ఇచ్చిన హైదరాబాద్ పారిశ్రామికవేత్త..

హైదరాబాద్ కు చెందిన క్యాప్స్టన్ సర్వీసెస్ సంస్థ అధినేత కొడాలి శ్రీకాంత్ టీటీడీకి భారీగా విరాళం ఇచ్చారు. మంగళవారం ( ఆగస్టు 12 ) తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీకాంత్ టీటీడీ శ్రీ వెంకటేశ్వర అన్నప్రసాదానికి రూ. కోటి, శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్టుకు రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. 

ఈ మేరకు శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం చెక్కులను అందించారు శ్రీకాంత్.