తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు..14 జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో మరో నాలుగు రోజులు భారీ వర్షాలు..14 జిల్లాలకు ఎల్లో అలర్ట్

 తెలంగాణలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  ఆగస్టు 12న భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయన్న వాతావరణ శాఖ..  14 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

ఆగస్టు 13న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.  ఈ అల్పపీడన ప్రభావంతో  ఆగస్టు 13 నుంచి వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందని భారత వాతావరణం శాఖ వెల్లడించింది.  రేపటి నుంచి భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలుంటాయని హెచ్చరికలు జారీ చేసింది.

 ప్రస్తుతం బంగాళాఖాతంలో ఒక ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోని కొనసాగుతూ ఉండడంతో  వర్షాలు కురుస్తున్నాయి.  ఆగస్టు 12న    కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, ములుగు, హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాల్లో భారీ వర్షాలు  కురిసే అవకాశం ఉన్నందున  ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. 

 ఇక(ఆగస్టు 12) హైదరాబాదులో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది.  ఆగస్టు 13 రేపు హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి భారీ  నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో  ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ 

►ALSO READ | రాష్ట్ర అభివృద్ధిలో రోడ్లు కీలకం.. ట్రాన్స్‎ఫోర్ట్ మంచిగుంటనే కంపెనీలు వస్తయ్: మంత్రి కోమటిరెడ్డి

ఇక ఆగస్టు 13న  అల్పపీడనం ఏర్పడిన తర్వాత   హన్మకొండ, వరంగల్, మహబూబాబాద్, జనగాం, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు ఉన్నందున  రెడ్ అలెర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ.  ఆగస్టు 13న  అతి భారీ వర్షాల నేపథ్యంలో కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసింది.  రేపు భారీ వర్షాల నేపథ్యంలో ఆదిలాబాద్, కొమరం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్స్ జారీ చేసిన వాతావరణ శాఖ . అల్పపీడనం మరింత బలపడే అవకాశం ఉందని, దీంతో ఆగస్టు 14 వ తేది నుంచి మరింతగా వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ