కేసీఆర్ చింతమడకకే కాదు రాష్ట్రానికి సీఎం:డీకే అరుణ

కేసీఆర్ చింతమడకకే కాదు రాష్ట్రానికి సీఎం:డీకే అరుణ

సీఎం కేసీఆర్ పై  విమర్శలు చేశారు బీజేపీ నాయకురాలు డీకే అరుణ. కేసీఆర్  చితమడకకే కాదు.. తెలంగాణ రాష్ట్రానికి సీఎం అన్న విషయాన్ని మర్చిపోవద్దన్నారు. రాష్ట్రంలోని అన్ని గ్రామాలను సమానంగా అభివృద్ధి చేయాలన్నారు.  చింతమడకలో  ప్రతీ ఇంటికి రూ. 10 లక్షలు ఇస్తానన్న కేసీఆర్ కు అన్ని గ్రామాల అభివృద్ధి పట్టదా? అని ప్రశ్నించారు. చింతమడకలా ఎన్ని గ్రామలను అభివృద్ధి చేస్తారో  కేసీఆర్ చెప్పాలని అన్నారు. గజ్వేల్, సిరిసిల్లకు సిద్ధిపేటకు మాత్రమే కేసీఆర్ వేల కోట్ల నిధులు ఇస్తున్నారని విమర్శించారు. రైతులకు ఇప్పటివరకు రైతు బంధు చెక్కులు రాలేదు…నిరుద్యోగులకు ఇచ్చిన హామీ నెరవేరలేదన్నారు.

పెన్షన్ లబ్ధి దారులపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. ప్రజలకు పుటగతులు ఉండవని మంత్రి చెప్పడం సిగ్గు చేటన్నారు. తమకు సపోర్ట్ చేస్తేనే పథకాలు అమలు చేస్తామనే విధంగా టీఆర్ఎస్ నేతలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నారని విమర్శించారు.