ట్రాన్స్ కో ఉద్యోగులకు డీఏ పెంపు

ట్రాన్స్ కో ఉద్యోగులకు డీఏ పెంపు

హైదరాబాద్, వెలుగు: ట్రాన్స్‌‌కోలో పనిచేస్తున్న ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డీఏను విడుదల చేస్తూ టీజీ ట్రాన్స్‌‌కో సీఎండీ ఎస్‌‌ఏఎం రిజ్వీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది వరకు డీఏ 8.77శాతంగా ఉండగా తాజాగా 11.78 శాతానికి పెరగనుంది. జులై 2023 నుంచి మే 2024 మధ్యకాలానికి డీఏ 8.77 శాతం.. 2024 జనవరి 1 నుంచి పెరిగిన డీఏ 11.78 శాతం వర్తించనుంది. ఈ మధ్య కాలానికి డీఏను లెక్కగట్టి ఎరియర్స్ రూపంలో చెల్లిస్తారు. అలాగే జులై 1 న అందుకునే వేతనంలో పెరిగిన డీఏ కలిపి చెల్లిస్తామని చెప్పారు.