తండ్రి కూతుళ్ల అనుబంధమే ప్రధాన కథాంశం.. ఈ శుక్రవారం విడుదల కానున్న ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’

తండ్రి కూతుళ్ల అనుబంధమే ప్రధాన కథాంశం.. ఈ శుక్రవారం విడుదల కానున్న ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’

రజత్ రాఘవ్, కాజల్, హాసిని సుధీర్ హీరో హీరోయిన్లుగా బేబీ పరిణిత రుద్రరాజు ముఖ్య పాత్రలో శరత్‌‌ రూపొందించిన చిత్రం ‘డ్యాడ్స్ లిటిల్ ఫ్రెండ్’. వెన్నెల సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌‌‌‌పై దీపక్ నిర్మించారు. శుక్రవారం సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌‌మీట్‌‌లో నిర్మాత దీపక్‌‌ మాట్లాడుతూ ‘నిజమైన ప్రేమ అంటే ఏమిటో ఈ చిత్రంలో చూపించాం.  

ఎంటర్‌‌టైన్‌‌మెంట్‌‌తో పాటు ఎమోషనల్‌‌గా ఉంటుంది. ఓ మంచి సినిమాతో నిర్మాతగా ఎంట్రీ ఇవ్వడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.  ఫాదర్‌‌ అండ్‌‌ డాటర్‌‌ ఎమోషన్‌‌ అందర్ని ఎంగేజ్‌‌ చేస్తుందని దర్శకుడు శరత్‌‌ చెప్పారు.  ఇందులో తండ్రి పాత్రను పోషించానని జెమినీ సురేష్‌‌ తెలిపారు. హార్ట్‌‌ టచింగ్‌‌ ఎమోషన్‌‌ ఉన్న సినిమా ఇదని హీరో రజత్‌‌ రాఘవ్‌‌ చెప్పాడు.