
దగ్గుబాటి రానా(Daggubati rana) తమ్ముడు దగ్గుబాటి అభిరామ్(Daggubati Abhiram) హీరోగా తెరకెక్కిన తొలి సినిమా అహింస(Ahimsa). తేజ(Teja) డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూన్ 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మూవీ ఎలా ఉంది? అభిరామ్ తన మొదటి సినిమాతో హిట్టు కొట్టాడా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ: రఘు(అభిరామ్) ఒక రైతు. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో అత్తా, మామల దగ్గర పెరుగుతాడు. మరదలు అహల్య(గీతికా తివారి)కి బావ అంటే చాలా ఇష్టం. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ అనుకోకుండా ఒకరోజు ఇద్దరు కుర్రాళ్లు అహల్యను హత్యాచారం చేసి, కొట్టి అడవిలో పడేసి వెళ్తారు. మరదలికి జరిగిన అన్యాయంపై న్యాయ పోరాటం చేస్తాడు రఘు. కానీ న్యాయం జరగదు. అహింసా మార్గంలో వెళ్తే తనకు న్యాయం జరగది భావించిన రఘు.. హింసని ఎంచుకుంటాడు. మరి ఆ తరువాత ఎం జరిగింది? తనకు న్యాయం జరిగిందా? న్యాయం కోసం రఘు ఏం చేశాడు? అనేది తెలియాలంటే అహింస మూవీ చూడాల్సిందే.
ఎలా ఉంది: డైరెక్టర్ తేజ మరోసారి ఆడియన్స్ నమ్మకాన్ని వమ్ము చేసాడు. అదే పాత కథ, అంతనకన్నా పాత స్క్రీన్ ప్లేతో ప్రేక్షకుల సహనానికి పరిక్ష పెట్టాడు. సినిమాలో చాలా సీన్స్ జయం, నువ్వు నేను సినిమాలను గుర్తుచేస్తాయి. ఇక లాజిక్కుల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. సినిమా మొత్తం సాగాదీతగా ఉంటుంది. ఫస్టాఫ్ ఎండింగ్ లోనే క్లైమాక్స్ అర్థమైపోతుంది. సెకండాఫ్ మరింత దారుణంగా ఉంటుంది. ఇక మొత్తంగా తేజ అహింస పేరుతో ఆడియన్స్ ను హింసించారనే చెప్పాలి.
ఎలా చేశారు: రఘుగా అభిరామ్ పరవాలేదనిపించాడు. కథలో కొత్తదనం లేదు కాబట్టి నటనకు కూడా పెద్ద స్కోప్ కూడా దొరకలేదు. అయినప్పటికీ నటనలో చాలా ఇంప్రూవ్ అవ్వాలి. ఇక అహల్యగా గీతికా తివారి(Geethika thiwari) పరవాలేదనిపించింది. అందంగా కూడా కనిపించింది. పోలీస్ ఆఫీసర్‌గా కమల్ కామరాజు, లాయర్‌గా సదా పాత్రలకు న్యాయం చేశారు. విలన్‌గా నటించిన రజత్ బేడి, ఛటర్జీ పాత్ర పోషించిన వ్యక్తి నటన కూడా ఒకేయిష్ గానే ఉంటుంది. అయినా అది యాక్టర్ల తప్పుకాదు. కథలో దమ్ములేదు.
సాంకేతిక నిపుణులు: సినిమాలో ఏదైనా పాజిటీవ్ విషయం ఉందంటే అది ఆర్పీ పట్నాయక్(RP Patnayak) సంగీతం. నీతోనే.. నీతోనే, ఉందిలే అనే పాటలు ఆకట్టుకుంటాయి. సమీర్ రెడ్డి సినిమాటోగ్రపీ కూడా బాగుంది. ఎడిటర్ అయితే చాలా వీక్. చాలా సీన్స్ కట్ చేసే అవకాశం ఉంది కానీ చేయలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.
ఇక మొత్తంగా అహింస సినిమా ఒక రొటీన్ రివేంజ్ డ్రామా విత్ ఫెడ్ అవుట్ స్టొరీ.