ఒత్తిడి పెరుగుతుందా.. వీటిని ఫాలోఅవండి.. లైఫ్ స్టైలే మారిపోద్ది..!

ఒత్తిడి పెరుగుతుందా.. వీటిని ఫాలోఅవండి..  లైఫ్ స్టైలే మారిపోద్ది..!

మన దేశ జనాభాలో  ఎక్కువగా యువత ఉన్నారు దీనివల్ల వర్క్ ఫోర్స్ పెరిగిపోతుంది. ఇది ఆశించదగ్గ పరిణామమే... కానీ యువతలో ఎక్కువమంది  ఎంతటి ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. దీని వలన చిన్న వయస్సులో అనేక ఆరోగ్యసమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ ఒత్తిడి నుంచి బయటపడాలంటే కొన్ని సింపుల్ టిప్స్ పాటిస్తే సరిపోతుంది అంటున్నారు నిపుణులు. ఇప్పుడు ఆ టిప్స్​ గురించి తెలుసుకుందాం. .   

పాత తరంతో పోలిస్తే  ఈ తరం వాళ్లు చాలా  ఎక్కువ ఒత్తిడి ఎదుర్కొంటున్నారు.  మిలియన్స్​  లో యువత  ఒత్తిడి విషయంలో మోతాదుకు మించి  విపరీతంగా ఎదుర్కొంటున్నారని  ఎన్నో స్టడీలు నిరూపించాయి. పని ప్రదేశాలో పోటీ, రిలేషన్ లో స్థిరత్వం లేకపోవడం, అనారోగ్యకరమైన లైఫ్ స్టయిల్ వంటి కారణాలెన్నో ఉన్నాయి. వీటన్నింటితో పాటు మేనేజ్ చేయలేని స్ట్రెస్ డిప్రెషన్ కు దారితీస్తోంది. ఒత్తిడితో కూడిన జీవితాన్ని గడుపుతున్న యూత్​  ఒత్తిడినుంచి  బయటపడాలి.

షెడ్యూల్ ప్లాన్ చేసుకోండి 

ఒక్క నిమిషం ప్లాన్ చేసుకుంటే.. మీకు పది నిమిషాల సమయం ఆదా అవుతుంది. ప్లానింగ్ చేసుకోవడం వల్ల మీ సామర్థ్యం పెరగడమే కాకుండా ఒత్తిడిని తగ్గిస్తుంది. టాస్క్ ఎదురుగా ఉన్నప్పుడు కాస్త ఒత్తిడి ఉండడమునేది సహజమే. అయితే చెక్​ లిస్ట్​  లేదా లిస్ట్​ జాబితా చేసుకోవడం వల్ల ఇబ్బంది ఉండదు. ఇలా కొన్ని వారాల పాటు చేస్తే దినచర్యలో భాగం అయిపోతుంది. ఇలా 
చేసుకోవడం వల్ల మీకు ఆ రోజు చేయాల్సిన విషయాల పట్ల ఒక స్పష్టత వస్తుంది. మీ లక్ష్యాలను చేరుకునేందుకు సాయపడుతుంది. అలాగే మిమ్మల్ని ఎప్పటికప్పుడు మోటెవేటెడ్ గా ఉంచుతుంది.

సరిపడా విశ్రాంతి అవసరం

అర్ధరాత్రి వరకు నిద్రపోకుండా ఉండడం అనేది మిలెన్నియల్స్ డెయిలీ జీవితం లో ఒక భాగం అయిపోయింది. ఈ అలవాటు మానసిక ఆరోగ్యం మీద చాలా దుష్ప్రభావాన్ని చూపెడుతుంది. నిద్రపోకుండా ఎక్కుమందిని ఆపేది మాత్రం సోషల్ మీడియాలో ఎక్కువ సేపు ఉండటం..  రోజుకు ముప్పావుగంట వ్యాయామం చేస్తే త్వరగా నిద్రపోతారు. అంతేకాదు మంచి నిద్ర పడుతుంది తెల్లవారి లేవగానే చాలా హాయిగా ఉంటుంది. కనీసం ఆరుగంటల నిద్ర.. పగలంతా ఆరోగ్యం. ఉండేందుకు సాయపడుతుంది. ఒకవేళ టైం ఉందనుకుంటే రోజుకి ఎనిమిది గంటలు నిద్రపోతే ఇంకా మంచిది. రోజుకి పావుగంట మెడిటేషన్ చేయడం వల్ల కూడా మానసికంగా, శారీరకంగా శక్తివంతంగా ఉంటారు. 

ఆహారంలో చేర్చాలి.

బిజీ షెడ్యూల్స్, శారీరకంగా ఎటువంటి వ్యాయామం లేని జీవితంతో పాటు అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు చాలా ఇబ్బంది పెడుతున్నాయి. మిలియన్స్​ మంది ప్రజలు  పూర్తి పౌష్టికాలతో కూడిన ఆహారాన్ని తినడమే మానేశారు చాలామంది. తినే ఆహారం ద్వారా ఒత్తిడి, ఆందోళనలను దరిచేరనీయకుండా. ఉండొచ్చని చాలామందికి అవగాహన లేదు. అరటిపండు, ఆవకాడో వంటి వాటితో మొదలు పెట్టి క్యారెట్, పెరుగు వరకు ఇవన్నీ మిమ్మల్ని మానసికంగా ఎంతో ప్రశాంతంగా ఉండుతాయి. అందుకని అలాంటి ఆహారాన్ని మీ డైడ్​ లో  చేర్చుకోవడం తప్పనిసరి. కావాలంటే న్యూట్రిషనిస్ట్ సలహా తీసుకుని తినడం మొదలు పెట్టాలి. ఇవి చాలా సింపుల్గా కనిపించే రెమెడీలే కానీ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి 

ఇనుస్ట్రుమెంటల్ మ్యూజిక్ వినాలి

సంగీతం వింటే ఎంతో సానుకూలమైన  ప్రభావం ఉంటుంది. ఆ సంగీతంలోని పదాలు, టెంపో , మిమ్మల్ని రిలాక్స్​ చేస్తాయి. ఒత్తిడికి గురయిన నరాలకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. పనిచేస్తున్నప్పుడు కూడా ప్రశాంతమైన ఇనుస్ట్రుమెంటల్​ మ్యూజిక్​ వినాలి.  దీనిపల్ల మెదడు గజిబిజీగా లేకుండా ఉంటుం  ఒకవేళ మూడ్ గా అనిపిస్తే ఆఫ్​ బీట్​ మ్యూజిక్​ వినాలి. ఇది మూడ్​ ను ఉత్తేజపరుస్తుంది. కొన్నిసార్లుపాటల్లో ఉండే పదాలు మీకు స్ఫూర్తినిస్తాయి. ఇలాంటి వాటిని ఫాలో అయితే ఒత్తిడినుంచి ఉపశమనం కలుగుతుందని పండితులు సూచిస్తున్నారు.

-వెలుగు,లైఫ్​-