Good Health: పొద్దున్నే గ్లాసుడు వాటర్ తాగితే ఎంత ఆరోగ్యమో తెలుసా.. ఇట్టే బరువు తగ్గుతారట..!

Good Health:  పొద్దున్నే గ్లాసుడు వాటర్ తాగితే ఎంత ఆరోగ్యమో తెలుసా.. ఇట్టే బరువు తగ్గుతారట..!

పొద్దున్నే బెడ్​ పై నుంచే మమ్మీ కాఫీ అంటారు.. కాని కాఫీ కాదు... అమ్మా వాటర్​ అని అడగండి.  అలా రోజు పొద్దున్నే అరలీటరు మంచినీళ్లు తాగితే ఇట్టే బరువు తగ్గుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు చాలా ఉపయోగాలున్నాయంటున్నారు. మరి పొద్దున్నే వాటర్​ తాగడం వలన కలిగే ప్రయోజనాలను ఒకసారి తెలుసుకుందాం. . .!

పొద్దుగాల మంచినీరు తాగటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. నిద్ర లేవగానే రెండు, మూడు గ్లాసు నీళ్లు తీసుకోవాలంటున్నారు నిపుణులు. పరగడుపున ఖాళీ కడుపుతో నీళ్లు తాగితే పేగులు శుభ్రమవుతాయి. ఈ ప్రక్రియ వల్ల మరిన్ని పోషకాలు అందుతాయి. కొత్త రక్తం తయారీని, కండరాల కణాల వృద్ధిని కూడా పెంచుతుంది. 

పొద్దునే కనీసం అరలీటర్ నీటిని తాగడం వల్ల మెటబాలిజం పెరుగుతుంది. తద్వారా బరువు తగ్గడానికి ఉపయోగపడుతుంది. రక్త కణాలను శుద్ధి చేయడం వల్ల శరీరంలోని మలినాలు తొలగుతాయి.దాంతో శరీర ఛాయ ప్రకాశిస్తుంది. శ్వేత ధాతువులనూ సమతుల్యం చేస్తుంది. ఇన్ఫెక్షన్స్ను దరి చేరకుండా చేస్తుంది.