దలైలామా పుట్టిన రోజు వేడుకలు

దలైలామా పుట్టిన రోజు వేడుకలు

ప్రముఖ బౌద్ధ గురువు, టిబెట్‌కు చెందిన దలైలామాకు ప్రధాని మోడీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 87వ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు దేవుడు దీర్ఘాయుష్షు, మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థిస్తున్నా అని ప్రధాని నరేంద్ర మోడీ ట్వీట్ చేశారు.

అటు హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలోని సుగ్లాగ్‌ఖాంగ్‌లో దలైలామా 87వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. సెంట్రల్ టిబెటన్ అడ్మిన్ నిర్వహించిన వేడుకల్లో హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ కూడా పాల్గొన్నాడు. దలైలామా పుట్టిన రోజు వేడుకల్లో సీఎం ఠాకూర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొని ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. 

దలైలామా పుట్టిన రోజు వేడుకల్లో  పాల్గొనడం సంతోషంగా ఉందని హిమాచల్ ప్రదేశ్ సీఎం జైరాం ఠాకూర్ అన్నారు. తాను దలైలామాతో ఫోన్ లో మాట్లాడానని..ఆయన చాలా సంతోషించారని సీఎం జైరాం తెలిపారు. హిమాచల్‌ ప్రదేశ్ లోని దేవ్‌భూమిలో నివసించే అవకాశం తనకు లభించిందని ఆనందం వ్యక్తం చేశారన్నారు. అందుకు హిమాచల్‌ ప్రభుత్వంతో పాటు కేంద్రానికి కృతజ్ఞతలు తెలుపుతున్నానని దలైలామా చెప్పినట్లు జైరాం చెప్పారు. దలైలామాకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసినప్పుడు ఈ విషయాన్ని చాలా ఉత్సాహంగా చెప్పారని ట్విట్టర్లో  సీఎం ఠాకూర్ పేర్కొన్నారు.