
ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు అనుకున్నట్టుగానే తుది జట్టులో స్థానం దక్కలేదు. ముందు నుంచి అనుకున్న ప్రకారం వర్క్ లోడ్ కారణంగా బుమ్రాకు రెండో రెస్ట్ లో రెస్ట్ ఇచ్చారు. బుమ్రా స్థానంలో ఫాస్ట్ బౌలర్ ఆకాష్ దీప్ కు స్థానం దక్కింది. టీమిండియా బుమ్రాను పక్కన పెట్టడం సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ స్టెయిన్ కు నచ్చలేదు.
బర్మింగ్‌హామ్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్ట్‌కు స్టార్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రాకు రెస్ట్ ఇవ్వాలనే నిర్ణయాన్ని మాజీ ఫాస్ట్ బౌలర్ తప్పుపట్టాడు. విశ్రాంతి ఇవ్వాలని నిర్ణయించినందుకు భారత జట్టు యాజమాన్యాన్ని ముఖ్యంగా కోచ్ గంభీర్‌ను ఈ మాజీ సఫారీ బౌలర్ విమర్శిస్తూ తన అసంతృప్తిని వ్యక్తం చేశాడు. సోషల్ మీడియా ద్వారా తన అసహనాన్ని వ్యక్తం చేస్తూ స్టెయిన్ ఎక్స్ లో ఒక ఆసక్తికర పోస్ట్ చేశాడు.
ALSO READ| IND VS ENG 2025: బస్‌లో వెళ్లకుండా ఒంటరిగా.. బీసీసీఐ రూల్ బ్రేక్ చేసిన జడేజా
"పోర్చుగల్ జట్టులో వరల్డ్ బెస్ట్ ప్లేయర్.. స్ట్రైకర్ రొనాల్డో ఉన్నాడు. వారు అతనిని ఆడకూడదని భావిస్తే అంతకన్నా పిచ్చితనం మరొకటి ఉండదు. అదేవిధంగా టీమిండియా బుమ్రాను ఆడకూడదని భావిస్తే అంతకన్నా పెద్ద పొరపాటు మరొకటి ఉండదు". అని స్టెయిన్ తన ఎక్స్ ద్వారా రాసుకొచ్చాడు.
బుమ్రా రెండో టెస్టులో లేకపోవడంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి తన అసంతృప్తి వ్యక్తం చేసాడు. రెండో టెస్టుకు బుమ్రాను తీసుకోవాల్సిందిగా చెప్పుకొచ్చాడు. "వరల్డ్ బెస్ట్ టెస్ట్ బౌలర్ కు వారం రోజులు రెస్ట్ ఇచ్చి రెండో టెస్ట్ ఆడకుండా చేశారు. బుమ్రా జట్టులో లేకపోవడం నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. టీమిండియా చేసిన ఈ పని నన్ను నిరాశకు గురి చేసింది". అని శాస్త్రి అన్నాడు.
పని భారం కారణంగా సిరీస్‌కు ముందే బుమ్రా సిరీస్‌లోని ఏవైనా మూడు మ్యాచులు మాత్రమే ఆడుతాడని.. మిగిలిన రెండు మ్యాచ్ ల్లో అతడి సేవలు కోల్పోతామని గిల్ రెండో టెస్టుకు ముందు క్లారిటీ ఇచ్చాడు. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్టులో బుమ్రా ఆడాడు. ఈ మ్యాచులో ఈ పేసర్ చెలరేగి తొలి ఇన్నింగ్స్ లో ఐదు పడగొట్టిన టీమిండియాకు ఓటమి తప్పలేదు. రెండో టెస్టులో టీమిండియా ఖచ్చితంగా గెలవాల్సిన టెస్టులో బుమ్రా ఆడతాడని ప్రచారం జరిగినా అతనికి రెస్ట్ ఇవ్వడం జరిగింది.