దళిత బాలికపై గ్యాంగ్​ రేప్​

దళిత బాలికపై గ్యాంగ్​ రేప్​

ముగ్గురు స్టూడెంట్లతో సహా రాజస్థాన్​లో నలుగురి అరెస్ట్​


జైపూర్: రాజస్థాన్​లోని జోధ్​పూర్​లో దళిత బాలికపై ఆదివారం గ్యాంగ్​రేప్​జరిగింది. బాలిక బాయ్​ఫ్రెండ్​సమక్షంలోనే ముగ్గురు కాలేజీ స్టూడెంట్లు ఆమెపై అత్యాచారం చేశారు. ముందుగా బాలిక స్నేహితుడిపై దాడి చేసిన నిందితులు అనంతరం మైనర్​బాలికను రేప్​చేశారని, నిందితులను అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. టీనేజ్​లవర్స్ శనివారం అజ్మీర్​నుంచి పారిపోయి బస్సులో  రాత్రి 10.30కు జోధ్​పూర్​ చేరుకున్నారు. గెస్ట్​హౌస్​లో రూమ్​కోసం వెళ్లగా అక్కడ కేర్​టేకర్​ బాలికతో అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో వారు అక్కడ నుంచి బయటకు వచ్చేశారని సీనియన్​ పోలీస్​అధికారి అమ్రిత దుహాన్​ తెలిపారు. వీరిద్దరు గెస్ట్​హౌస్​ బయట నిలబడి ఉండగా ముగ్గురు నిందితులు సమందర్​సింగ్, ధర్మపాల్​ సింగ్​, భతమ్​సింగ్​వారిని కలసి రూమ్, ఫుడ్​ఇస్తామని ప్రామిస్​చేసి తమవెంట తీసుకువెళ్లారు. జేఎన్​వీయూ ఓల్డ్​క్యాంపస్​లోని హాకీ గ్రౌండ్​కి చేరుకున్న తరువాత బాలుడిపై దాడిచేసి బాలికపై సామూహిక అత్యాచారం చేసి పారిపోయారు. అనంతరం మార్నింగ్​ వాకర్స్ ను బాధిత టీనేజర్లు సాయం కోరగా వారు పోలీసులకు సమాచారం అందించారు. డాగ్​స్క్వాడ్, ఫోరెన్సిక్​టీమ్ తో  నిందితుల కోసం గాలింపు చేపట్టిన పోలీసులు సీసీటీవీ ఫుటేజ్​ను పరిశీలించి జోధ్​పూర్​లోని గణేశ్​పురలో ఉన్న ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. గెస్ట్​హౌస్​ కేర్​టేకర్​ను కూడా అరెస్టు చేశామని వెల్లడించారు. 

ALSO READ:రాజకీయ వైషమ్యాలను వీడండి: సుప్రీం కోర్టు